జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వినిపిస్తున్న పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదలైన ప్రస్థానం పాన్ వరల్డ్ స్థాయిలోకి చేరుకుంది.. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ లెవెల్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా తనకు సాటి లేరు అనిపించుకున్నారు.. ఈ చిత్రం ద్వారా అద్భుతమైన హిట్టందుకొని మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నారు.. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో ఎప్పుడూ కూడా ఎలాంటి రిస్క్ పనులైనా సరే డూప్ లేకుండా తానే చేస్తూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆ విధంగానే ఆది సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన రిస్క్ వల్ల ఆయన చేతుకున్న చిన్న నరం కట్ అయిపోయి చివరికి ప్రాణాల మీదికి వచ్చిందట. మరి అది ఎలా జరిగింది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. వివి వినాయక్ డైరెక్షన్లో ఆది సినిమా ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు..
మాస్ యాక్షన్ గా వచ్చినటువంటి ఈ చిత్రం 2002లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్లో జరిగిన ఒక సన్నివేశాన్ని వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అభిమానులతో పంచుకున్నారు.. షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేయి తెగిన విషయాన్ని చెప్పుకొచ్చారు.. షూటింగ్లో ఫైట్ స్టంట్స్ చేస్తుంటే ఆయన చేయికి తీవ్రమైన గాయమైంది. రక్తం ఆగకుండా కారిపోతుంది. ఎన్టీఆర్ నొప్పిని భరించలేక పోతున్నారు. అక్కడే ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్ మమ్మల్ని భయపెట్టాడు. నావల్ల కాదు వైజాగ్ లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లండి అని చెప్పాడు.
చేతిలో ఒక చిన్న నరం ఉంది అది తెగినట్టుంది అది సున్నితమైంది దానివల్ల ప్రాణాలకే ప్రమాదం అన్నాడు. దీంతో నేను, నిర్మాతలు వణికిపోయారు. వెంటనే వైజాగ్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాం. డాక్టర్లు ఇక ఓకే అని చెప్పేదాకా చిత్ర యూనిట్ మొత్తం భయపడిపోయామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆ సంఘటన గురించి ఆ ఇంటర్వ్యూ లో గుర్తు చేసుకుని ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పుకొచ్చారు. అలాంటి వివి వినాయక్ అద్భుతమైన కథతో మళ్ళీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆలోచన ఉందని చెప్పుకోచ్చారు.