అందరి చూపులు విశ్వంభర పైనే.. తప్పుకుంటే ఆ మూవీలకు తిరుగేలేదు..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ సోషియో ఫాంటసీ జోనర్ మూవీగా రూపొందుతుంది. మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిష ఈ మూవీ లో చిరంజీవికి జోడిగా కనిపించబోతోంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక సంక్రాంతి కి ఒక సినిమా మాత్రమే కాకుండా ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాను కూడా విడుదల చేయనున్నారు. అలాగే టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ ప్రస్తుతం మజాకా అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి  అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరికొన్ని రోజుల్లో ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక బాలయ్య , బాబి కాంబోలో పొందుతున్న సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే విశ్వంబర మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కి వచ్చే అవకాశాలు చల తక్కువ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే విశ్వంభర మూవీ కనుక తప్పకుండా మజాకా , తండెల్ మూవీలకు చాలా ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. మరి విశ్వంభర మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ లో ఉంటాడా ... లేక తప్పుకుంటుందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: