మహేష్ - బాలయ్య మల్టీ స్టారర్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేసాడుగా..!

Amruth kumar
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు .. తండ్రిని మించిన హీరోగా పేరు తెచ్చుకుని టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం ద‌ర్శీక‌ దీరుడు రాజమాళి తో ఓ పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. ఇదే క్రమంలో మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించారు . అలాగే పలు మల్టీ స్టార్లు కూడా చేశారు. వాటిలో వెంకటేష్ , మహేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.

 అయితే ఈ సినిమా తర్వాత మహేష్ - బాలయ్య తో కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది . అది కూడా తమిళ్ స్టార్ డైరెక్టర్ కెవిఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య - మహేష్ కలిసి ఆ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా మధ్య లోనేే ఆగిపోయింది. అయితే రీసెంట్ గా బాలయ్య - మహేష్ మల్టీ స్టార్ సినిమా రాబోతుందంటూ వార్త లు కూడా వస్తున్నాయి. ఆ వార్తలు నిజం చేస్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా బాలయ్య - మహేష్  మల్టీస్టారర్ కథ గురించి విన్నానని ... ఆ సినిమా కు తానే వర్క్ చేస్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చాడు .

తమన్ మాటలతో మరోసారి అభిమానులు ఈ కాంబో కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మల్టీ స్టారర్ పై ఇప్పటికీ ఎలాంటి అధికార ప్రకటన రాలేదు . బాలకృష్ణ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలతో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం బాల‌య్య‌ బాబీతో చేస్తున్న సినిమాతో  మరొకసారి భారీ సక్సెస్ సాధించాలనే నమ్మకంతో ఉన్నారు. అలాగే  ఆ సినిమా తర్వాత బోయపాటితో చేస్తున్న అఖండ 2 సినిమాతో కూడా భారీ హిట్ కొట్టాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. ఇలా ఫూల్ జోష్‌లో ఉన్నడు బాల‌య్య‌. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా విరిద్ద‌రు కలిసి మల్టీస్టారర్ చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: