2001 సంక్రాంతి వార్ : పోటీలో ముగ్గురు స్టార్స్.. గెలిచిన ఆ ఒక్కరు ఎవరో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పండగ వచ్చింది అంటే చాలా సందడి వాతా వరణం నెలకొంటూ ఉంటుంది . అందుకు ప్రధాన కారణం అనేక సినిమా లు సంక్రాంతి పండుగ కు విడుదల అవుతూ ఉండడమే . ఇక పోతే 2001 వ సంవత్సరం మాత్రం సంక్రాంతి పండగ టైమ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగింది . అసలు అప్పుడు ఏం జరిగింది ..?  ఎవరు సినిమాలు విడుదల అయ్యాయి . ఎవరు ఆఖరు గా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ నిలిచారు అనేది వివరాలను తెలుసు కుందాం. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ సినిమాలు విడుదల అయ్యాయి.

మొదటగా 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు సినిమా విడుదల కాగా , ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహనాయుడు , ఆ తర్వాత వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో మొదటగా విడుదల అయిన మృగరాజు సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ సైనా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.

ఇక ఆ తర్వాత విడుదల అయిన నరసింహ నాయుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత విడుదల అయిన దేవీపుత్రుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే 2001 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహనాయుడు సినిమా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: