నయన్ ను బీట్ చేసిన త్రిష.. ఒక్క సినిమాకి ఏకంగా అన్ని కోట్లు..?

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నయనతార , త్రిష ముందు వరసలో ఉన్నారు. వీరిద్దరూ సినీ పరిశ్రమలో కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతున్న ఇప్పటికి కూడా తమిళ సినీ పరిశ్రమలో కుర్ర హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న నటీమణులుగా కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే వీరిద్దరూ నటిస్తున్న సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో వీరికి అవకాశాలు వరుసగా వస్తూ ఉండడం మాత్రమే కాదు మీరు అడిగినంత రెమ్యూనిరేషన్ ఇస్తూ మరి వీరిని సినిమాల్లో పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

దానితో వీరు తీసుకున్న స్థాయి రెమ్యూనిరేషన్ ను మరెవ్వరూ కూడా కోలీవుడ్ హీరోయిన్లు తీసుకోవడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే నయనతార కంటే కూడా ప్రస్తుతం త్రిష రెమ్యూనిరేషన్ విషయంలో ఓ అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష అనేక సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది. కొంత కాలం క్రితం త్రిష , తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కోసం ఈ బ్యూటీ ఏకంగా 6 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈమెకు లియో సినిమా తర్వాత క్రేజ్ విపరీతంగా పెరగడంతో ఈమె పారితోషకాన్ని డబల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఒక్కో మూవీ కి దాదాపు 12 కోట్ల మేర పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాడి వర్సెస్ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: