ఆ నిర్మాత సినిమాల్లోనే వాణిశ్రీకి ఉన్న ఆ స్పెషల్ ఏంటి... ఎవరా స్టార్ నిర్మాత..?
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
ఒకప్పుడు అంటే 1970వ దశకంలో స్టార్ హీరోయిన్ వాణిశ్రీ పేరు చెబితే అప్పట్లో తెలుగు కుర్రకారకు హృదయం గిలిగింతలు పెట్టేది. మరీ.. ముఖ్యంగా ఏఎన్నార్, వాణిశ్రీ కాంబినేషన్ అంటే అదిరిపోయేది. వాణిశ్రీ చీరలు అదిరిపోయేవి. రంగురంగుల వాణిశ్రీ చీరలు వెండి తెరమీద సినిమా చూస్తున్న మహిళలకు వీనుల విందుగా ఉండేవి. తెలుగు హీరోయిన్లలో అప్పట్లో వాణిశ్రీ, ఆమె తర్వాత లక్ష్మి లాగా చీరలని కట్టేవారు ఎవరు ఉండరు అన్న చర్చలు నడిచేవి.
అంత గొప్పగా, అంత అందంగా వాణిశ్రీ చీరలు కట్టే వారట. మరి ముఖ్యంగా వాణిశ్రీ.. అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ అంటే అప్పట్లో ప్రేక్షకులకు మహా ఇష్టం. వీరిద్దరూ కలిసి 1978లో వచ్చిన చిలిపి కృష్ణుడు సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఏకంగా 25 వారాలపాటు ఆడింది. ఆ తర్వాత ఇదే వాణిశ్రీ - ఏఎన్ఆర్ కాంబినేషన్‌లో దసరా బుల్లోడు సినిమా వచ్చింది. ఈ సినిమా లో పాటలు చాలా అందంగా, హుషారుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా లో పాటలు అప్పట్లో ప్రేక్షకులను.. కుర్రకారు ను ఓ ఊపు ఊపేశాయి.
రామానాయుడు గారి సినిమా అంటే అన్ని పకడ్బందీగా ఉంటాయి. ప్రొడక్షన్, ప్లానింగ్ వగైరా అన్ని టైం టు టైం జరిగిపోతూ ఉంటాయి. అప్పట్లో ఒక టాక్ కూడా ఉండేది. వాణిశ్రీ ఎంత మంది హీరోల పక్కన నటించినా.. ఎన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన.. ఎన్ని చీరలు కట్టినా.. రామానాయుడు గారి సినిమాలలో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది అని. ఎందుకో రామానాయుడు గారు సినిమాలలో వాణిశ్రీ పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్న చర్చలు ఉండేవి.