సీతారామం, ప్రభాస్ ఫౌజీ కి మధ్య ఉన్న ట్విస్ట్ ఏంటంటే..!?

Anilkumar
ప్రభాస్ కల్కి తర్వాత ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అధికారికంగా ఈ ఈవెంట్ నుంచి ఫొటోలు, వీడియోలు రిలీజ్ కాకపోయినా అక్కడికి వెళ్లిన వారి దగ్గర్నుంచి పలు ఫొటోలు, వీడియోలు లీక్ అయి వైరల్ అవుతున్నాయి. ఇక ఫౌజీ’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా తమిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రుపుకుంటుంది.

అయితే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌ పాల్గొనడంలేదు. రెండో షెడ్యూల్‌ నుంచి పాల్గొంటార‌ని చిత్ర‌యూనిట్ ప్రక‌టించింది. ఇదిలావుంటే ఈ మూవీ నుంచి ద‌స‌రా కానుక‌గా గ్లింప్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.  అయితే ఫౌజీ సినిమాలో కూడా ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి సీతా రామం సినిమాలో హీరో కూడా ఒక సైనికుడిగా మనకు కనిపించాడు మరి ఇలాంటి సందర్భంలోనే సీతారామం సినిమాకి పౌజీ సినిమాకి మధ్య సంబంధం ఏంటి హను రాఘవపూడి కూడా తన యూనివర్స్ ను స్టార్ట్ చేశారా అంటూ మరి

 కొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు. నిజానికి ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం అయితే లేదని హను రాఘవపూడి ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. రెండు స్టోరీలు ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాను అని చెప్పాడు. ఇక సీతారామం సినిమా ప్యూర్ లవ్ స్టోరీ గా మాత్రమే ఎలివేట్ అయింది. కానీ ప్రభాస్ సినిమాలో లవ్ స్టోరీ తో పాటు ఒక యుద్ధ వాతావరణంని తలపించే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భారీగా ఉండబోతున్నట్టుగా ఆయన తెలియజేశాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: