19 ఏళ్ళ వయసులో రష్మిక ఫస్ట్ ఆడిషన్.. వీడియో వైరల్.. ఎంత క్యూట్ గా ఉందో?

praveen
రష్మిక మందన..ఈమె గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ హీరోయిన్ ఇప్పుడు నేషనల్ క్రష్ గా కూడా కొనసాగుతోంది. ఎంతో మంది కుర్ర కారు మనసుల్ ను కొల్లగొట్టి ఇక నేషనల్ క్రష్ అనే ఒక బిరుదును అందుకుంది. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే.. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ అమ్మడికి టాలెంట్ మాత్రమే కాదు  అదృష్టం కూడా బాగానే కలిసి వస్తోంది. అందుకే ఇక ఇప్పుడు కేవలం సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 కోలీవుడ్లో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా అవతారమెత్తిన ఈ ముద్దుగుమ్మ.. ఇక టాలీవుడ్ లోకి చలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్యతో జోడి కట్టి మొదటి సినిమాతో హిట్టు కొట్టేసింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన గీత గోవిందం సూపర్ హిట్ అయింది. అటు వెంటనే  మహేష్ బాబుతో సర్లేరు నీకెవ్వరు సినిమా చేసి స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. ఇక అల్లు అర్జున్తో చేసిన పుష్ప సినిమాతో ఆమె రేంజ్ మారిపోయింది. కాగా రష్మిక మందన్న వయసు ఇక ఇప్పుడు 28 ఏళ్లు.

 యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న రష్మిక మందన తన 19వ ఏట నుండే సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రష్మిక తన 19వ ఏట ఇచ్చిన ఆడిషన్ కు సంబంధించిన కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కర్ణాటక కు చెందిన రష్మిక తన మొదటి ఆడిషన్ కూడా కన్నడలోనే అందించింది. ఇక ఇందులో ఆడిషన్ నిర్వహిస్తున్న వాళ్ళు చెప్పిన డైలాగులను రష్మిక చెప్పడం చూడవచ్చు. అంతేకాదు విభిన్నమైన గెటప్లలో రష్మిక యాక్టింగ్ చేసింది. అంతేకాదు ఇక తన డాన్స్ పర్ఫామెన్స్ కూడా చేసి చూపించింది. అయితే 19 ఏళ్ల వయసులో ఎంతో క్యూట్ గా ఉన్న రష్మిక.. ఇప్పుడు 208 ఏళ్ల వయసులో కూడా అచ్చం అలాగే ఉంది అని.. ఈ వీడియో చూశాక ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: