ఎంతోమంది బాలీవుడ్ హీరోలున్నా.. వార్-2లో జూ. ఎన్టీఆరే ఎందుకు.. కారణం అదేనట?

praveen
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. అటు తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ బాలీవుడ్ గడ్డపై కూడా తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇదే జూనియర్ ఎన్టీఆర్ కు మొదటి డైరెక్ట్ బాలీవుడ్ మూవీ కావడం గమనార్హం. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబై వెళ్ళిన తారక్ ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేయడానికి పెద్ద కారణమే ఉందట. గత కొంతకాలం నుంచి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ వస్తున్న హృతిక్ రోషన్ వరుసగా సూపర్ హిట్ లు కొడుతున్నాడు. గతంలో వార్ సినిమాలో కూడా హృతిక్ రోషన్ ఒంటరిగా కాకుండా.. టైగర్స్ శ్రాఫ్ లాంటి హీరోలతో కలిసి నటించాడు. అయితే హృతిక్ సినిమాలకు తెలుగులో పెద్దగా స్కోప్ లేదు. ఉన్న అంతంత మాత్రమే. అందుకే సౌత్ లో మంచి మార్కెట్ ఉన్న ఎన్టీఆర్ను హీరోగా పెట్టుకుంటే.. ఇక బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా సూపర్ హిట్ కొట్టొచ్చు అని ఇక్కడ ప్రేక్షకులకు  కూడా బాగా దగ్గర కావచ్చు అని అనుకున్నాడట హృతిక్ రోషన్. అందుకే ఏరి కోరి మరి తారక్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దానికి తోడు ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు ఎన్టీఆర్. ఈ పాత్రకు తారక్ మాత్రమే సరిపోతాడని.. ఆయన గత సినిమాల్లోని యాక్టింగ్ చూసి మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ను వార్ 2 లో సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: