"వాడి ముఖంలో అసలు హీరో అయ్యే లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయా..?".. చిరంజీవి నోట ఊహించని మాట..!

Thota Jaya Madhuri
చిరంజీవి..చిరంజీవి..చిరంజీవి..ఈ పేరు చెప్తుంటేనే కొంతమందికి రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ జనాలలో సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైనమిక్ హీరో చిరంజీవి అని చెప్పుకోవడంలో సందేహం లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి ..ఆ తర్వాత తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి పలువురు ఎంట్రీ ఇచ్చేలా తన పేరుని మార్చుకున్నాడు అంటే ఆయనలోని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు .


అయితే అటువంటి చిరంజీవి ఒక హీరోని చూసి అతగాడికి "అసలు హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా..?" అంటూ ముఖం మీద చెప్పేశాడట. అది తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోతున్నారు .అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయన చెప్పిన దాంతో తప్పేముంది ..? నిజమేగా ..అంటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు . పూర్తి వివరాల్లోకి వెళితే..


 మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది . ఆయన పేరుని ఉపయోగించుకొని పలువురు మెగా హీరోలుగా ట్యాగ్ చేయించుకుని ఇండస్ట్రీ లోకి వచ్చారు. వచ్చిన అందరూ సక్సెస్ అవ్వారు అని ..చెప్పలేము కానీ మెగా హీరోలుగా మాత్రం కాస్తో కూస్తో లాభ పడ్డారు అని చెప్పుకోవాలి . అయితే మెగాస్టార్ చిరంజీవి తన మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ..ఆయనకు సపోర్ట్ చేయాలి అంటూ మెగా కుటుంబ సభ్యులు అడిగినప్పుడు మాత్రం మెగాస్టార్ చిరంజీవి షాక్ అయిపోయారట .


అంతేకాదు ఆ మాటల సందర్భంలో "అసలు అతగాడికి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా..?" అంటూ కూడా కుటుంబ సభ్యుల ముందే తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారట. అయితే చిరంజీవికి తన చిన్న కూతురు శ్రీజ పై ఉన్న ఇష్టమే కళ్యాణ్ దేవ్ ని హీరో అవ్వడానికి సపోర్ట్ చేసేలా చేసిందట . ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోవడం.. మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటే నిజం అవ్వడం అందరికీ తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: