' అఖండ 2 ' నంద‌మూరి ఫ్యాన్స్ ఫ్యీజులు ఎరిగే అప్‌డేట్ ఇచ్చిన బోయ‌పాటి..!

RAMAKRISHNA S.S.
- అఖండ లాంటి సూప‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2
- బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సంజ‌య్ ద‌త్ కు కీల‌క పాత్ర‌
- ఎన్బీ కే 109 షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే సెట్స్ మీద‌కు
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
నందమూరి న‌ట‌సింహ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా అఖండ అయితే థియేటర్లలో ప్రేక్షకులను పూనకాలతో ఊపేస్తుంది. అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత.. బోయపాటి రామ్‌తో స్కంధ‌ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు బోయపాటి.. అఖండ 2 పై వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అఖండ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాక అఖండ 2 సినిమా షూటింగ్ ఎప్పుడు ? అంటూ బాలయ్య అభిమానులతో పాటు.. తెలుగు సినిమా అభిమానులు అందరూ సోష‌ల్‌ మీడియాలో ఒక్కటే కాక రేపుతున్నారు.  విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం ప్రస్తుతం ఎన్‌బీకే 109 చివరి దశలో ఉంది. డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ - బాబి దర్శకత్వంలో తన కెరీర్లో 109 వ సినిమాలో బాల‌య్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్నారు. ఇక బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ 2 స్క్రిప్ట్ పూర్తి చేసి.. ప్రస్తుతం డైలాగు వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమా లో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో .. సంజ‌య్ ద‌త్ ఒక కీలకపాత్రలో నటించబోతున్నారు. ఏదేమైనా అఖండ 2 పై బోయ‌పాటి ఫ్యీజులు ఎగిరే అప్‌డే ట్ త్వ‌ర‌లోనే ఇవ్వ‌నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: