40 ఏళ్ల చిరంజీవి పెళ్లి శుభలేఖ.. ఆ రోజుల్లోనే ఎంతో కాస్ట్‌లి.. చిరు రేంజ్ మామూలుగా లేదుగా..!

Amruth kumar
తెలుగు సినిమా ని మరో మెట్టుకు తీసుకు వెళ్లిన హీరోలలో నటరత్న ఎన్టీఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు ..  సామాన్య కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా లోకి వచ్చి తన నటనతో తెలుగులోనే తిరుగులేని మెగాస్టార్ గా ఎదిగి .. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకే గాడ్ ఫాదర్ గా ఉన్నాడు చిరంజీవి. ఆయన ఆదర్శంగా తీసుకుని ఇప్పటికీ ఎంతో మంది హీరోలు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. చిరంజీవి డ్యాన్స్‌ స్టెప్పులు ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి . కొన్ని వందల పాట  లకు తనదైన శైలిలో డ్యాన్స్ ల‌తో అలరించారు చిరు .  
ఆరుపదులు వయసు దాటినా కూడా తన నటన డాన్స్ ల‌తో నేటితరం కుర్ర హీరోల కు చెమటలు పట్టిస్తూ వరుస‌ సినిమాల తో బాక్సాఫీస్ దగ్గరకు వస్తున్నారు.  అలాంటి చిరంజీవి దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ను ఇచ్చి వివాహం చేశారు . వీరి పెళ్లి 1980 ఫిబ్రవరి 20 న ఘనంగా జరిగింది . అయితే ఇప్పుడు చిరంజీవి పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆహ్వాన పత్రికలో చిరంజీవి పెద్ద పూల మాల వేసి ఉన్న ఫోటోని కూడా వేశారు. ఇక వీరి పెళ్లి ప‌త్రిక ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది.

ఆరెంజ్ మ‌ర‌యు బ్రౌన్ క‌ల‌ర్ అక్ష‌రాలు ఇంగ్లీష్ లో అచ్చువేయ‌బ‌డి ఉంటాయి. 40 సంవత్సరాల క్రితమే మెగాస్టార్ పెళ్లి ఆహ్వాన పత్రిక డిజైన్ ఓ రేంజ్ లో ఉందంటూ నేటిజన్లు అంటున్నారుబ‌. వెడ్డింగ్ కార్డుబ‌ను మెగా అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. త్వరలోనే చిరంజీవి విశ్వంభర సినిమాబ‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక సినిమాతో మరోసారి కం బ్యాక్ ఇవ్వాలని చిరు గట్టి సాహసమే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: