ఎన్టీఆర్ సింహాద్రి కే షాక్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరంటే..!

Amruth kumar
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోయాడు. ఆయన దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా అభిమానులు థియేటర్ వద్ద బారులు తీరేవారు. నువ్వు నాకు నచ్చవు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకటేష్ దగ్గర నుంచి మళ్లీ ఏ సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో  వాసు మూవీ తో వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన జెమినీ కూడా ప్లాప్ కా మిగిలింది.

మాస్ హీరోగా ఎదగాలనుకున్న వెంకటేష్ ప్రయత్నం జెమిని సినిమాతో బెడ్స్ కొట్టింది. అయినను ఫ్యామిలీ సినిమాల హీరో గానే ప్రేక్షకులు ఆదరించారు. వాసు , జెమినీ వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్‌లు తర్వాత వెంకటేష్‌కి హిట్ ఇచ్చిన మూవీ అంటే వసంతం. 2003లో విడుదలైన ఈ సినిమాను కోలీవుడ్  స్టార్ డైరెక్టర్ గా ఉన్న విక్రమన్ దర్శకత్వ వహించారు. తెలుగులో తొలిసారిగా డైరెక్ట్ చేసిన మూవీ కూడా వసంతం కావడం విశేషం. అలాగే ఈ సినిమా తర్వాత కూడా వెంకటేష్ కి చెప్పవే చిరుగాలి సినిమాతో కూడా మరో విజయాన్ని అందించాడు. ఈ సినిమాల తర్వాత విక్రమన్‌ మరో తెలుగు సినిమా తీయలేదు. అలాగే అయ‌న‌ కెరీర్ కూడా అక్కడితో ముగిసిపోయింది.

వెంకటేష్- వసంతం సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా క్లాసిక్ హిట్‌గా నిలవడానికి ప్రధాన కారణం.. ఈ సినిమాకి సంగీతం ఎస్.ఏ.రాజ్ కుమార్ అని ఖ‌చ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాను ప్రధానంగా ప్రేక్షకల్లోకి తీసుకువెళ్లింది పాటలే. ఆ తర్వాత ఈ సినిమా స్టోరీ మిగిలిన విషయాలు వసంతం మూవీకి సంబంధించి మరో ప్రధాన విషయం ఏమిటంటే..? సింహాద్రి సినిమాకి పోటీగా విడుదలై సూపర్ హిట్ సాధించడం. ఈ రెండు సినిమాలకు ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉంది కానీ.. అప్పట్లో సింహాద్రి ప్రభంజనం గట్టిగానే ఉంది. అయినప్పటికీ కూడా వసంతం సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవటమే కాకుండా వెంకటేష్ ని మళ్ళీ ఫామ్ లోకి తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: