బాలయ్య నేషనల్ రికార్డ్... ఆ హీరోలకు షాక్..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సీనియర్ హీరోలనే టాప్ ప్లేస్ లో ఉన్న బాలయ్య. గతంలో వరుస అపజ‌యాలను ఎదుర్కొన్నాడు. బాలకృష్ణ పది సినిమాలు చేస్తే అందులో హిట్ అయ్యేది మూడు మాత్రమే.. కానీ ప్లాప్ అయ‌న‌ సినిమాలను మించేలా బాలయ్య హిట్ సినిమాలు ఉండేవి. బాలకృష్ణ హీరోగా వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమా 500 రోజులు ఆడి ఇండియాలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.


ఈ క్రమంలో 1999లో బాలయ్య‌ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి ఆయన కెరియర్ను మరో లెవల్ కు తీసుకువెళ్లింది. ఈ సినిమా తర్వాత బాలయ్య టాలీవుడ్ లోనే నెంబర్ 1న్ పొజిషన్ కి వెళ్ళాడు. సమరసింహారెడ్డి 77 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడుంది. ఈ సినిమా తర్వాత మరోసారి సమార సింహారెడ్డి తెరకెక్కించిన దర్శకుడు బి.గోపాల్ తో నరసింహనాయుడు సినిమాతో 2001 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పోటీగా మెగాస్టార్ నటించిన మృగరాజు కూడా అదే రోజు వచ్చింది. తొలి రోజు మెగాస్టార్ హవా చూపించిన.. రెండో రోజు నుంచి మాత్రం నరసింహనాయుడు జూలు విదిల్చాడు థియేటర్లో టికెట్లు దొరకకుండా చేశాడు.


అలానే ఈ సినిమాలతో పాటు వెంకటేష్ దేవి పుత్రుడు సినిమా కూడా ఇదే సంక్రాంతికి విడుదలైంది. ఇక చిరంజీవి - వెంకటేష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లు గా మిగిలాయి. అయితే బాలకృష్ణ నరసింహనాయుడు మాత్రం ఇండియాలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. డైరెక్ట్‌గా విడుద‌లై 127 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న న‌ర‌సింహ‌నాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక హీరో న‌టించిన సినిమా 100 కేంద్రాల్లో వంద రోజులు ఆడ‌టం అదే మొద‌టి సారి. ఆ అరుదైన ఘ‌న‌త బాల‌కృష్ణ‌కే ద‌క్కింది. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు బి.గోపాల్ టేకింగ్, చిన్నికృష్ణ క‌థ‌, బాల‌కృష్ణ న‌ట విశ్వ‌రూపం, సెంటిమెంట్‌, మ‌ణిశ‌ర్మ సంగీతం అన్ని క‌లిసి న‌ర‌సింహ‌నాయుడు సినిమాను రికార్డు సృష్టించే విధంగా చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: