తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ మొదట హీరోగా ఓ సినిమాలో నటించాడు. కానీ ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో ఈయన ఆ తర్వాత సినిమాల్లో విలన్ పాత్రలో నటించడం మొదలు పెట్టాడు. విలన్ పాత్రలలో నటించిన ఈయనకు మంచి గుర్తింపు లభించింది. కానీ మళ్ళీ ఆ తర్వాత ఈయన సినిమాల్లో హీరోగా నటిస్తూ చాలా కాలం నుండి అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఆఖరుగా ఈయన నటించిన సిటీమార్ సినిమా మంచి విజయం సాధించింది.
ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు గోపీచంద్ హీరోగా నటించిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా గోపీచంద్ , శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గోపీచంద్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా తాను ఆఖరుగా నటించిన భీమా సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను గోపీచంద్ చెప్పుకొచ్చాడు.
తాజా ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ ... బీమా సినిమాను నేను బాగా నమ్మాను. కానీ ఆ సినిమాలో ఒక చిన్న ఎపిసోడ్ తేడా కొట్టింది ... అని మాకు తెలుసు. మిగతాది బాగున్నప్పటికీ అది వర్కౌట్ కాకుంటే ఆ ఒక్క ఎపిసోడ్ సినిమానే ఓవర్ షాడో చేస్తుంది అని గోపీచంద్ చెప్పుకోచ్చాడు. ఇక ఆ సినిమా రిసల్ట్ మీకు ముందే తెలుసా అని ప్రశ్న గోపీచంద్ కి ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ ... ఆ బ్లాక్ బాగోలేదు అనే విషయం మాకు ముందే తెలుసు అని గోపీచంద్ అన్నారు. ఇక వరస అపకేలతో కెరియర్ను కొనసాగిస్తున్న గోపీచంద్ విశ్వం మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.