ఏంటి సమంతని నాగచైతన్య కంటే ముందే బన్నీ ప్రేమించాడా.. ఇన్ని రోజులు తెలియదే అనుకుంటారు చాలామంది ఈ మాటలు వింటే. మరి ఇంతకీ నాగచైతన్య కంటే ముందే సమంతను బన్నీ ప్రేమించాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.. నిజంగానే బన్నీ సమంత ని అంతలా ఇష్టపడ్డాడా.. అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా సమంత, రానా, త్రివిక్రమ్ వంటి సెలబ్రిటీలు అలియా భట్ నటించిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా త్రివిక్రమ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. రజినీకాంత్ తర్వాత మళ్లీ అంత పాపులర్ అయిన హీరోయిన్ ఎవరు అంటే సమంతనే.. అప్పుడప్పుడు సమంత హైదరాబాద్ కి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక సమంత ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఈ సినిమాలో ఈమెనే పెద్ద హీరో..ఇక ఈ సినిమా చేసేటప్పుడే నాగచైతన్య సమంత ప్రేమలో పడ్డారు అన్నారు. కానీ ఈ సినిమా చేసేటప్పుడు కాదు వేరే సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలాగే ఏ మాయ చేసావే సినిమా చూసి చాలా మంది సమంత మాయలో పడిపోయారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు..ఎందుకంటే ఈ సినిమా చూశాక ఓ రోజు నాకు అల్లు అర్జున్ ఫోన్ చేసి మీరు కొత్తగా వచ్చిన ఏమాయ చేసావే సినిమా చూశారా.. ఆ సినిమాలో హీరోయిన్ చాలా బాగుంది..ఆ కొత్త అమ్మాయి కోసమైనా మీరు ఆ సినిమా చూడండి అంటూ నాకు సలహా ఇచ్చారు.. ఇక ఆరోజు బన్నీ మాటలు చాలా ఎక్సైటింగ్ గా అనిపించాయి..
అల్లు అర్జున్ అప్పట్లోనే సమంతని ఎంతగానో ఇష్టపడ్డాడు. సమంత కి పెద్ద అభిమానిగా మారిపోయాడు అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని మరోసారి గుర్తు చేశాడు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ మాటలు వింటుంటే నాగచైతన్య కంటే ముందే బన్నీ సమంతతో ప్రేమలో పడిపోయారు. ఇక అప్పటికీ బన్నీకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇక ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నాగచైతన్య సమంతతో ప్రేమలో పడకపోతే అల్లు అర్జున్ సమంత ప్రేమలో పడేవాడు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు