సింగం అగైన్ ఓటిటి డీల్ క్లోజ్.. ఎన్ని కోట్ల ఆఫరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో అజయ్ దేవగన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును హిందీ సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం అజయ్ దేవగన్ , రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో కూడా అజయ్ దేవ్  గన్ కి మంచి గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే అజయ్ దేవగన్ ఇప్పటికే సింగం సిరీస్ మూవీ లలో హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సిరీస్ నుండి ఇప్పటి వరకు వచ్చిన మూవీ లు మంచి విజయాలను అందుకోవడంతో అజయ్ దేవగన్ కు మంచి గుర్తింపు లభించింది. ఇక మరికొన్ని రోజుల్లో సింగం అగైన్ అనే సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఇప్పటికే ఈ మూవీ బృందం విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు ఈ సినిమా ఓ టి టి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఏకంగా 130 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై హిందీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad

సంబంధిత వార్తలు: