శివాజీ గణేశన్ ఎత్తికున్న ఆ కుర్రోడు.. ఇండియాలోనే ఫేమస్.. అతని బ్యాగ్రౌండ్ ఇదే...!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు సాహసాలకు కిరాక్ అడ్రస్ గా మారిన ఓ స్టార్ హీరో చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాక్షన్. స‌న్నీవేశాల‌తో సంబంధమే లేదు. కథ నచ్చితే పాత్ర ఎలాంటిదైనా సినిమా చేసేస్తాడు. వైవిధ్యమైన పాత్రల్లో ఆయన్ని మించిన నటుడు మరెవరు లేరు .. పైన ఫోటోలో అలనాటి దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ చేతిలో ఉన్న ఆ కుర్రోడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. అలాగే ఆ బుడ్డోడు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. సౌత్ చిత్ర పరిశ్రమలో బడా హీరోల్లో ఈ కుర్రాడు కూడా ఒకరు. ఆయన నటనకు ఆవత్ దేశమే ముద్దురాలు అవుతుంది. తనదైన‌ నటనతో ప్రపంచాన్ని సైతం ఫిదా చేయగలడు.. ఒక స్టార్ హీరో అనే కాకుండా తానుఒక స్టార్ హీరో అనే కాకుండా.. తాను న‌టించే సినిమా కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉంటాడు. ప్రస్తుతం ఆయన మనసు 68 సంవత్సరాలు అయిన వ‌రుస‌ సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి షాక్ ఇస్తూ వస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరో గుర్తుపెట్టుకోండి చూద్దాం ఆయన సినీ జీవితంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు మరెన్నో అవార్డులు కూడా ఉన్నాయి. ఈ హీరోకి భాషతో సంబంధం లేకుండా అభిమానులు కూడా ఉన్నాడు. ఆ హీరో మరెవరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్.


ఇక తన నటనతోనే ప్రపంచాన్ని గెలిచిన గొప్ప నటుడు.. సినిమాలతో ఆయన చేసిన ప్రయోగాలు ఎన్నో ఒకప్పుడు పదో తరగతి కూడా చదవని వ్యక్తి ఈరోజు ప్రపంచ గర్వించ దగ్గ నటుడిగా ఎదిగారు. 1954 లో తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పరమక్కుడి ప్రాంతంలో జన్మించిన కమలహాసన్ చిన్నతనంలోనే సినిమా రంగంలో తనదేన ముద్ర వేశారు బాల నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. తన నటనతో మెప్పించాడు. తన అద్భుతమైన నటనకు మొదటి చిత్రానికే జాతియ‌ అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత తన సినిమాలతో యాక్టింగ్ తో జాతీయ ఉత్తమ నటుడుగా మూడుసార్లు అవార్డు తెచ్చుకున్నారు.


కేవలం హీరో గానే కాకుండా క్లాసికల్ డాన్స్ సంగీతంలోనూ కమల్‌కు అనుభవం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీమంతుడు సినిమాలో డాన్స్ అసిస్టెంట్గా  పనిచేశారు కమల్. ఆ తర్వాత స్క్రీన్ ప్లే రాయడం పై ఆసక్తి పెంచుకున్నారు. అటు డాన్స్ కొరియోగ్రఫీ… ఇటు రైటింగ్ స్కిల్ ఉడండంతో ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలనుకున్నారట. కానీ.. డైరెక్టర్ కె. బాలచందర్ సూచించడంతో నటనవైపు అడుగులు వేసిన కమల్.. అరంగేట్రమ్ సినిమాతో కథానాయికుడిగా పరిచయమయ్యారు. వీరిద్దరి కాంబోలో దాదాపు 35కి పైగా సినిమాలు వచ్చాయి. ఆకలి రాజ్యం, భారతీయుడు, నాయకుడు, సాగర సంగమం, దశావతారం, విశ్వరూపం 2 సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: