పవన్ ఆ స్టార్ హీరోయిన్ కు కోట్లు విలువ చేసి గిఫ్ట్ ఇచ్చాడా? మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్..!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అది పేరు కాదు .. ఒక తుఫాన్.. ఇది చెప్పింది మరి ఎవరో కాదు సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. తెలుగు చిత్ర పరిశ్రమలోనే పవర్ స్టార్ గా దూసుకుపోతున్న సమయంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టాడు. గతంలో హిట్‌ కోసం పది సంవత్సరాలు వెయిట్ చేసిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో మాత్రం బ్లాక్ బస్టర్ కోసం దాదాపు అంతకంటే ఎక్కువ సమయం ఎదురు చూశాడు. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ తో పాటు  దేశవ్యాప్తంగా ఎన్టీయే ప్రభుత్వంలోనే కీలకపాత్ర పోషించి అసలైన గేమ్ చేజర్గా మారాడు.

అదేవిధంగా 20024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో కూటమి ప్రభుత్వాన్ని అధికారుల్లోకి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు అందుకున్నాడు. అదేవిధంగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తాను చేయవలసిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే పనిలోపడ్డాడు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగంలోకి దిగి కంకణం కొట్టుకున్నాడు.. ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే పవన్ కళ్యాణ్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఓ హీరోయిన్ కి దాదాపు 50 లక్షలకు పైగా విలువ చేసే ఓ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా వచ్చిన జల్సా సినిమాలో నటించిన సెకండ్ హీరోయిన్ పార్వతి మెల్టన్  ఈమెకు అప్పట్లో పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లు వార్తాలు వచ్చాయి. అయితే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని అభిమానులు కూడా అంటున్నారు.. మరి ఈ పుకారు ఎందుకు బయటకు వచ్చిందో ఎవరు పుట్టించారు అనేది వాళ్ళకే తెలియదు. పార్వతి మెల్టన్ విషయాని కొస్తే ఈమె 2005లో వచ్చిన వెన్నెల సినిమాతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అలా అదే క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాలో కూడా హీరో ప్రియురాలి పాత్రలో నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి చేసుకొని యూఎస్ లో సెటిల్ అయినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: