బాలయ్య దర్శకులను చూసి భయపడుతున్న తారక్ ఫ్యాన్స్.. ఏకంగా అన్నిసార్లు అలాంటి అనుభవం..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ కు అద్భుతమైన విజయాలను అందించిన కొంత మంది దర్శకులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం అపజయాలను అందించిన సందర్భాలు ఉన్నాయి. అలా బాలయ్యకు బ్లాక్ బస్టర్ విజయాలను ,  జూనియర్ ఎన్టీఆర్ కి అపజయాలను అందించిన దర్శకులు ఎవరు అనే వివరాలు తెలుసుకుందాం.
నందమూరి నట సింహం బాలకృష్ణ తో చాలా సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. బాలకృష్ణ , బి గోపాల్ కాంబోలో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ , సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు , పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలు వచ్చాయి. ఇందులో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ లు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్ , బి గోపాల్ కాంబినేషన్లో అల్లరి రాముడు , నరసింహుడు అనే రెండు సినిమాలు వచ్చాయి.

ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే బాలయ్య కు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. బాలయ్య , బోయపాటి కాంబో లో సింహ ,  లెజెండ్ ,  అఖండ అనే మూడు మూవీ లు వచ్చాయి. ఈ మూడు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో దమ్ము అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా ఈ ఇద్దరు దర్శకులు బాలయ్య కు బ్లాక్ బాస్టర్ మూవీ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందించగా ... జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం ఫ్లాప్ లను అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: