సమంత - ప్రభాస్ కాంబినేషన్లో మిస్ అయిన సినిమాలు ఇవే..అన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లే..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీ లో కొన్ని కొన్ని రేర్ కాంబినేషన్స్ మిస్ అవుతూ ఉంటాయి . అయితే అలాంటి కాంబోలో సినిమా వస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అని తెలిసి కొందరు డైరెక్టర్ లు ..అలాంటి కాంబోను తెరకెక్కించాలి అని బాగా ట్రై చేస్తూ ఉంటారు . అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు  అలా సెట్స్ పైకి వచ్చినట్లే వచ్చి ఆగిపోయాయి.. మరికొన్ని మాటలతోనే ఆగిపోయాయి.. మరికొన్ని వేరే వాళ్లను పెట్టి సినిమాను కంప్లీట్ చేసి హిట్ అందుకున్నాయి. వాళ్ళల్లో ఓ క్రేజీ కాంబో నే ప్రభాస్ - సమంత .
సమంత ఓ టాప్ హీరోయిన్ ప్రభాస్ ఓ పాన్ ఇండియా హీరో.. ఇద్దరి కాంబోలో సినిమా అంటే రచ్చ రంబోలానే . నో డౌట్ 100 కోట్లు కన్ఫామ్ ..అంతేనా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ చేయడం పక్కన పెడితే చరిత్ర తిరగరాసే విధంగా కలెక్షన్స్ కురిపిస్తారు అభిమానులు. అయితే అలాంటి క్రేజీ కాంబోలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాకపోవడం అందరి అభిమానులకి షాకింగ్ గా ఉంది . చాలామంది డైరెక్టర్స్ క్రేజీ హిట్ కొట్టడానికి ఇలాంటి కాంబోస్ నే చూస్ చేసుకుంటూ ఉంటారు.
అయితే ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు ప్రభాస్ - సమంత కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు . కానీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం వీళ్ళ కాంబోలో సినిమా తెరకెక్కించాలని బాగా ట్రై చేశారు . అలా వీళ్ళ కాంబోలో మూడు బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.  అందులో మొదటి ది "డార్లింగ్". ఎస్ ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన డార్లింగ్ సినిమాలో హీరోయిన్గా మొదటగా సమంతని అనుకున్నారట .
కానీ సమంతనే ఈ సినిమా రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత  మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్గా సమంతని అనుకున్నారట.  అప్పుడు సమంత వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట . ఆ తర్వాత  మిర్చి సినిమాలో గంగా రిచోపాధ్యాయ ప్లేస్ లో సమంత నే ఆఫర్ అందుకుందట . కానీ సమంత ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఇలా మూడుసార్లు అవకాశాలు వచ్చిన సరే సమంత ..ప్రభాస్ తో సినిమా చేయలేకపోయింది.  ఇకపై చేస్తుంది అన్న నమ్మకాలు కూడా జనాలలో లేవు . ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ సినిమాలో నటిస్తూ ఉంటే ..సమంత అంతకుమించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. రేపో మాపో కొత్త సినిమాను కూడా ప్రకటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: