"దండం రా బాబు..నా సినిమాలో ఆ శ్రీలీల వద్దు"..తెలుగు హీరో షాకింగ్ కామెంట్స్..అసలు ఏమైందంటే?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలోకి కొత్త బ్యూటీ వచ్చింది అంటే చాలు ..అందరు హీరోస్ బెల్లం చుట్టూ ఈగలులా ఆ హీరోయిన్ నే తమ సినిమాలో పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక డైరెక్టర్స్ గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు.  ఏజ్ ఎంత వ్యత్యాసం ఉన్నా సరే ఆమెనే తమ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అలాంటి సినిమాలు మనం చాలానే చూశాం.
మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అలాంటివి మనం ఎక్కువుగా  చూస్తున్నాం.  ముఖ్యంగా కన్నడ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చాలామంది డైరెక్టర్ లు.. పలువురు స్టార్ హీరోస్ ఆమె చుట్టూనే తిరుగుతూ .. ఆమెకే అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ ఆరు సినిమాల్లో నటించి మూడు హిట్లు మూడు ఫ్లాపులు తన ఖాతాలో వేసుకుంది శ్రీ లీల.
నిజానికి శ్రీలీలది చాలా చిన్న ఏజ్. అతి తక్కువ వయసు లోనే స్టార్ డమ్ దక్కించుకున్న శ్రీలీలకు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఇస్తూనే వచ్చారు. అయితే వరుసగా పెద్ద పెద్ద హీరోలు అందరూ శ్రీలీల కాల్ షీట్స్  కోసం ఎగబడుతూ ఉంటే ..ఒకే ఒక్క స్టార్ హీరో  ఆమెను రిజెక్ట్ చేశాడు.  ఆయన మరెవరో కాదు రెబల్ హీరో ప్రభాస్ . ఎస్ రెబల్ హీరో ప్రభాస్ హీరోయిన్గా శ్రీ లీల తన సినిమాలో వద్దు అంటూ డైరెక్టర్ కి సజెస్ట్ చేశారట .
ఆ సినిమా మరేంటో కాదు "ది రాజా సాబ్".  మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో మనకు తెలిసిందే.  ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా శ్రీలీలను  కూడా అనుకున్నారట.  కానీ 'హైట్ చాలా వేరియేషన్ వస్తుంది అని ..కాంబో సూట్ అవ్వదు' అంటూ ప్రభాస్ రిజెక్ట్ చేశాడట.  హైట్ కారణమగా అమ్మడు మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది పాపం..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: