ఆ దర్శకుడి సినిమాలో ఆమెతో కలిసి నటించాలని ఉంది.. వైరల్ గా మారిన ఆలియా కామెంట్స్..?

Pulgam Srinivas
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

ఈ మూవీ ద్వారా ఆలియా కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ జిగ్రా అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో నిన్న రాత్రి ఈ మూవీ బృందం తెలుగు లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , నటి సమంత ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ ఈవెంట్లో భాగంగా ఆలియా భట్ మాట్లాడుతూ ... నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో సమంత తో కలిసి ఒక సినిమాలో నటించాలని ఉంది. ఇది పబ్లిసిటీ కోసం చెప్పడం లేదు. నిజంగానే త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో సమంత తో ఒక సినిమాలో నటించాలని ఉంది అని ఈమె జీగ్రా తెలుగు ప్రమోషన్లలో భాగంగా చెప్పుకొచ్చింది. జీగ్రా మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు లేవు. మరి ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: