యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ..వైవిధ్యమైన సంగీతాన్ని అందిస్తూ వరుసపెట్టి ఆఫర్లను కొల్లగొడుతున్నాడు . మ్యూజిక్, బీజీఎంతో ర్యాంప్ ఆడిస్తాడంతే. రజనీకాంత్ భార్య లతాకు స్వయంగా మేనల్లుడు అయినా తన మ్యూజిక్ టాలెంట్‌తో మూవీ ఛాన్సులు పొందుతున్నాడు. గత ఏడాది రిలీజైన జైలర్, లియోలో అతడి ఇచ్చిన బీజీఎంకు పూనకాలు వచ్చేశాయి ఫ్యాన్సుకి. అలాగే అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే.. ఆ మూవీ హిట్ అన్న టాక్ కూడా వస్తోంది. సంగీత వాయిద్యాలతో కొత్త కొత్త సౌండ్స్ క్రియేట్ చేస్తూ సీన్‌ను బట్టి మ్యూజిక్ అందించడంలో దిట్టగా మారిపోయాడు. తొలి సినిమా త్రీ మూవీతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు.ఇదిలావుండగా ఇన్నాళ్లు సినిమాల మధ్య పోటీ ఉండేది. ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడితే ఆ సినిమా తోపు. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ సినిమా తోపు. ఇప్పుడు ఆ పోటీ పాటలకు కూడా వచ్చేసింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగులో డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తమిళ్‌లో మాత్రం ఇప్పటికీ గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్లు జరుగుతున్నాయి. తమిళ్‌లో ఏ సినిమా రిలీజ్ అయినా సరే.. ఆడియో ఫంక్షన్ ఉండాల్సిందే.
గతంలో తెలుగులోను ఇలాంటి ఈవెంట్స్ ఉండేవి కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అన్నీ పోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఆ లోటును కాస్త భర్తీ చేస్తున్నారు. దేవర సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ 5 వేలు అనుకుంటే.. 35 వేల మంది ఫాన్స్ వచ్చారు. టైగర్ ఫ్యాన్స్ తాకిడికి ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ ఈవెంట్‌లో అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్‌ను ఫాన్స్ ఓ రేంజ్‌లో ఊహించుకున్నారు. తీరా రద్దవడంతో అనిరుధ్ పర్ఫార్మెన్స్ మిస్ అయ్యామని ఫీల్ అయ్యారు. ఇప్పుడు మరింత ఫీల్ అవుతున్నారు.రీసెంట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ ఆడియో లాంచ్ జరిగింది. ‘మనసిలాయో’ పాటకు అనిరుధ్ రవిచంద్రన్ అదిరిపోయే లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గతంలో ‘హుకుం’ సాంగ్‌కి ఆడిటోరియం దద్దరిల్లిపోగా.. ఇప్పుడు ‘మనసిలాయో’కి కూడా అదే సీన్ రిపీటైంది. తాజాగా ఈ ఫెర్ఫార్మెన్స్ వీడియోని రిలీజ్ చేయగా.. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. ‘అయ్యో.. ఇలాంటి ఫెర్ఫార్మెన్స్ మిస్ అయిపోయామే’, ‘అనిరుధ్.. సూపర్ ఫెర్ఫార్మెన్స్’ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.అనిరుధ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ యొక్క 'దేవర' విడుదలతో విజయాన్ని అందుకున్నాడు, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీత స్కోర్‌ను అందించాడు. ఈ చిత్రంలో అందించిన నేపథ్య సంగీతం మరియు పాటలు ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా నిలిచాయి.