దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీకి ఒక మూల స్తంభం లాంటివారు.. ఎన్టీఆర్ కంటే ముందు ఇండస్ట్రీలోకి వచ్చిన నాగేశ్వరరావు దాదాపు 250 పైగా సినిమాల్లో నటించారు. ఈయన సినిమాల్లోకి వచ్చింది నాటకాల ద్వారా. నాటకంలో ఎక్కువగా అమ్మాయిల వేషం వేసిన నాగేశ్వరరావుని ఆయన ఫ్రెండ్స్ ఎక్కువగా ట్రోల్ చేసేవారట.అయినా కూడా ఏఎన్ఆర్ పట్టించుకోకుండా నటనే ప్రాణంగా ముందుకు వెళ్లారు. అయితే అలాంటి నాగేశ్వరరావు ఐదుగురు పిల్లలు ఉన్నా కూడా ఆ హీరో ని ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని నాగేశ్వరరావు కి వెంకట్, నాగార్జున,నాగ సరోజ, నాగ సుశీల, సత్యవతి అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఐదుగురు పిల్లలున్న నాగేశ్వరరావు అక్కినేని సుమంత్ ని దత్తత తీసుకున్న విషయం చాలామందికి తెలియదు..
అక్కినేని సుమంత్ ఏఎన్ఆర్ కూతురు అయినటువంటి సత్యవతి యార్లగడ్డ సురేంద్రలకు జన్మించాడు. అలాగే సుమంత్ కి సుప్రియ అనే సోదరి కూడా ఉంది.. అయితే అయిదుగురు పిల్లలున్న ఏఎన్ఆర్ సుమంత్ ని దత్తత తీసుకోవడానికి కారణం సుమంత్ పుట్టిన సమయంలో అక్కినేని నాగేశ్వరరావుకి హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన సంవత్సరం పాటు సినిమా షూటింగ్ లేకుండా ఇంటిపట్టునే ఉన్నారట. అలా సంవత్సరం పాటు ఇంట్లోనే ఉన్న ఏఎన్ఆర్ చుట్టూ అక్కినేని సుమంత్ తిరిగే వారట.
అలా బుడిబుడి నడకలు వేస్తూ నాగేశ్వరరావు కాళ్లకు అడ్డం పడుతూ నాగేశ్వరరావు భుజాల మీద ఆడుకున్న సుమంత్ ని చూసి ఎంతగానో మురిసిపోయేవారట ఏఎన్ఆర్.
అయితే సుమంత్ తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లే సమయంలో వీడు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు వీడిని ఇక్కడే వదిలేసి పోండి అని చెప్పారట. దాంతో తండ్రి మాట కాదనలేక సత్యవతి కూడా సుమంత్ ని తండ్రికి అప్పజెప్పిందట. అలా ఏఎన్ఆర్ తో మంచి ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకున్న సుమంత్ ని ఏఎన్ఆర్ దత్తత కూడా తీసుకున్నారు.