వామ్మో: మహేష్ ధరించిన ఈ వెకేషన్ బ్యాగ్ ధర తెలిస్తే షాకే..!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా వచ్చే యేడాది మొదటిలోనే ప్రారంభం కాబోతోందట. పూర్తిగా ఈ సినిమా మీదే మహేష్ బాబు దృష్టి పెట్టి అందుకు తగ్గట్టుగా ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడమే కాకుండా పలు రకాల వెకేషన్కు కూడా వెళ్తూ ఉన్నారు మహేష్ బాబు. మహేష్ బాబు కెరియర్ లోనే  ఎప్పుడు చేయలేని న్యూ లుక్కుని మెయింటైన్ చేస్తూ ట్రెండీగా మారుతూ ఉన్నారు. ముఖ్యంగా పెద్ద జుట్టు గడ్డంతో పాటు హాలీవుడ్ హీరో లాగా కనిపించేందుకు కసరతులు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు ధరించిన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. తాజాగా ఈ బ్యాగుకు సంబంధించి ధర కూడా వైరల్ గా మారుతున్నది. ఐకానిక్ ఎల్ వి మోనోగ్రామ్ ను కలిగి ఉన్న ఈ పసుపు, నలుపు రంగు బ్యాగు ధర అక్షరాల రూ.3,81,841 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని తర్వాత చూసిన తర్వాత.. మహేష్ బాబు లగ్జరీ పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో చెప్పవచ్చు.

తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యాషన్ ఐకానిక్ గా పేరు సంపాదించిన మహేష్ బాబు తన స్టైల్ ని ఎవరు కాపీ చేయలేరని అంతగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఈవెంట్స్ పార్టీలకు ధరించి దుస్తులు కూడా చాలా స్టైలిష్ గా సింపుల్ గా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మహేష్ బాబు స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు అభిమానులు. ఇక రాజమౌళితో సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటనతో త్వరలోనే రాబోతున్నది. మరి ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల లిస్టు విడుదల చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: