తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం లేటెస్ట్ మూవీ వెట్టైయాన్. ‘జై భీమ్’ సినిమా ఫేమ్ టీజే జ్ఞానవేళ్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.అయితే ఈ నేపథ్యంలోఈ సినిమా టైటిల్ పై జరుగుతున్న రచ్చ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు.. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తమిళ టైటిల్ల్స్ గురించి బాగా డిస్కషన్ జరుగుతుందని అందుకే మీడియాతో మాట్లాడాలనుకున్నానని ఆయన తెలిపారు..’వెట్టయాన్ ‘ మూవీకి తెలుగు లో వేటగాడు టైటిల్ పెడతామని ఆ మూవీ టీం తెలుగు ఫిలిం చాంబర్‌కు లేఖ రాశారు. ఆ టైటిల్ వేరే వాళ్లకుండటం వల్ల అది దొరకలేదు.తమిళనాడు లో ఒకప్పుడు తమిళ్ టైటిలే ఉండాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ రూల్ పెట్టుకుంది. తర్వాత తర్వాత అది మారుతూ ఆ రాష్ట్రంలో ఇంగ్లీష్ టైటిల్స్‌తో పాటు ఏ టైటిల్స్ అయినా అంగీరిస్తున్నారు.
మేకర్స్ అనుకున్న టైటిల్ వేట్టయాన్.. ది హంటర్ తెలుగుకు అనువాదం చేయగలిగేంత టైటిల్ అయితే దొరకలేదు. తమిళ్ టైటిల్ తో తెలుగు లో రిలీజవుతుందని సోషల్ మీడియాలో అంతా అనుకుంటున్నారు.ప్రస్తుతం ఇండియన్ సినిమా గ్లోబల్ వైడ్ గా ఖ్యాతి పొందింది.అందువల్ల వేరే చోట విడుదల చేసినప్పుడు సరిపోయే టైటిల్ దొరికినప్పుడు టైటిల్‌ను మార్చుకుంటున్నారు.. లేదంటే ఒకే టైటిల్‌పై విడుదల చేస్తున్నారు.దీనితో టైటిల్‌ను ఇలా కావాలనే పెడుతున్నారని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. సినిమా సినిమాలాగే చూడండి. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. బాగా లేదంటే తెలుగు టైటిల్ పెట్టినా లేక ఏ టైటిల్ పెట్టినా తిరస్కరిస్తారు. అంతేకాని తమిళ టైటిల్‌ను కావాలని మనపై రుద్దరూ అని దిల్ రాజు తెలిపారు..వేట్టయాన్ సినిమా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు.అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందని దిల్ రాజు తెలిపారు..