రివ్యూ: జనక అయితే గనక.. సినిమా హైలెట్స్ ఇవే..!

Divya
సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలతో సినిమాలు తీస్తే మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి. అలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా హీరో సుహాస్ నటించిన జనక అయితే గనక సినిమా కూడా ఇలాంటి చిత్రమే అన్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ విధంగా ఈ సినిమా మెప్పించిందో తెలుసుకుందాం.

డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఒక వినోదాత్మకమైన సినిమా దసరా కానుకగా విడుదలయ్యింది. సుహాస్ (ప్రసాద్) పాత్రలో కనిపించారు. తనకు పిల్లల్ని కనడం పట్ల ఒక క్లారిటీ ఉంటుంది. అయితే పిల్లల్ని కనాలి అంటే కచ్చితంగా వాళ్ళకి జీవితంలో ఏదైనా బెస్ట్ ఇవ్వాలని లేకపోతే కనడమే మానేయాలనుకొని ఫిలాసఫీతో జీవిస్తూ ఉంటారు. అందుకే వివాహమైన రెండేళ్లు అవుతున్న పిల్లలు జోలికి మాత్రం వెళ్లారు ప్రసాద్..ఈయన భార్య ( సంగీత విపిన్) కూడా తన భర్త బాధలు అర్థం చేసుకుంటూ ఉంటుంది.. అయినప్పటికీ కూడా ఇంట్లో అత్తమామలు మాత్రం పిల్లలు ఎప్పుడు అని గోల చేస్తూ ఉంటారు.. ఇలాంటి సమయంలోనే ఈ మధ్యకాలంలో పిల్లల్ని పెంచాలి అంటే కచ్చితంగా కోటి రూపాయల వరకు కావాలి అంటూ ప్రసాద్ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారట.

అయితే ఇలాంటి సమయంలోనే అనుకోకుండా  ప్రసాద్ భార్య గర్భవతి కావడంతో.. కుటుంబ నియంత్రణ కోసం ఉపయోగిస్తున్న కండోమ్ సరిగా పనిచేయలేదని ఆ కంపెనీ పైన కేసు వేస్తారట. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం పైన ఈ సినిమా స్టోరీ. ఇందులోని సన్నివేశాలు కొన్ని ప్రేక్షకుల చేత శభాష్ అనిపించాయి. ఇలాంటి పాయింట్ తో ఎప్పుడు కూడా సినిమా రాలేదని మరికొంతమంది నేటిజన్స్ తెలుపుతున్నారు. స్క్రీన్ ప్లే బాగా మార్చి సినిమాలు చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అలాగే భార్యాభర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు బాగానే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయట. ఇంటర్వెల్స్ సన్నివేశం ఆసక్తికరంగా మారుస్తుందట. మొదటి భాగంతో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్ అని తెలుపుతున్నారు. హైకోర్టు డ్రామాలో బలం లేకపోయినా.. స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ ని చూపించడం హైలెట్గా నిలిచింది.

ఇక సుహాస్ అయితే క్యారెక్టర్ లో జీవించి పోయారు. మిడిల్ క్లాస్ పాత్రలలో ఎన్నోసార్లు నటించి మెప్పించారు. అయితే చివరిలో సుహాస్ బామ్మ ఇచ్చిన ట్విస్ట్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందట.మరి టెక్నికల్ గా ఈ సినిమా ఓకే అనిపిస్తున్న కలెక్షన్స్ ఏ విధంగా రాపడుతుందో చూడాలి. ఫ్యామిలీ చూడదగ్గ సినిమా అన్నట్టుగా తెలుపుతున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: