సీనియర్ హీరోయిన్ మణిచందన గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈ మధ్య కాలంలో మని చందన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఈమె ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.
ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మని చందన , జాన్వి కపూర్ కి తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా మణిచందన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమెకు కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా రూపొందబోయే సినిమాలో మీరు సోలో హీరోయిన్గా ఎంపిక అయ్యారట అది నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది.
దానికి మని చందన సమాధానం ఇస్తూ ... నిజమే ... కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఓ సోషియా ఫాంటసీ మూవీ ని మొదలు పెట్టారు. ఆ మూవీలో నేను సోలో హీరోయిన్గా ఎంపిక అయ్యాను. రెండు రోజుల షూటింగ్ పూర్తి అయ్యాక ఎందుకో ఆ సినిమాను ఆపివేశారు. నాపై కూడా ఒక రోజు షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమా స్టార్ట్ అవుతుంది అని చాలా రోజులు వెయిట్ చేశాను. కానీ ఆ మూవీ స్టార్ట్ కాలేదు అని మని చందన తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది.