మన తెలుగు సినీ పరిశ్రమలో కొంత మంది హీరోలు యావరేజ్ టాక్ వచ్చిన కూడా తమ సినిమాలతో అద్భుతమైన కలెక్షన్లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసే స్టామినాను కలిగి ఉన్నారు. అలా ఈ మధ్య కాలంలో యావరేజ్ టాక్ తో కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లను అద్భుతమైన స్థాయిలో రాబట్టిన కొంత మంది హీరోల సినిమాల గురించి తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ
మూవీ కి నెగటివ్ టాక్ వచ్చింది.
దానితో ఈ
సినిమా చాలా పెద్ద మొత్తంలో నష్టాలను నిర్మాతలకు మిగులుస్తోంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ
మూవీ లాంగ్ రన్ లో భారీ ఎత్తున కలెక్షన్లను వసూలు చేసింది. ఈ
మూవీ ద్వారా నిర్మాతలకు పెద్ద మొత్తంలో నష్టాలు ఏమీ రాలేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ
మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఈ
సినిమా ఏకంగా వందల కోట్ల కలెక్షలను వసూలు చేసింది. యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మొదటి భాగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ
మూవీ కి
కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ
మూవీ పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పటికే ఈ
సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను కూడా అందుకుంది. ఇలా ఈ మధ్య కాలంలో ఈ ముగ్గురు సినిమాలకు కాస్త అటు ఇటు టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్లను వీరు
బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సినిమాలతో రాబట్టారు.