యండమూరి నవలలతో చిరంజీవికి ఎన్నో బ్లాక్బస్టర్లు... ఇద్దరికి ఎక్కడ తేడా కొట్టింది..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో ఛాలెంజ్ సినిమా ఎంత పెద్ద హిట్ సినిమా అన్నది అందరికీ తెలిసిందే. ఛాలెంజ్ మాత్రమే కాదు అభిలాష - దొంగ మొగుడు - రాక్షసుడు - స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవలల ఆధారంగా చిరంజీవి చేసిన సినిమాలే. వీటిలో నాలుగు సినిమాలు అభిలాష - దొంగ మొగుడు - రాక్షసుడు - ఛాలెంజ్ చిరంజీవి - ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చినవి కావటం విశేషం. ఇక నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు చిరంజీవి కెరీర్ లో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ఒక స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ మాత్రమే డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు యండమూరి వీరేంద్ర దర్శకుడు కావడం విశేషం. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాతకి భారీ నష్టాలను మిగల్చుగా ... ఆ తర్వాత యండమూరి దర్శకత్వ బాధ్యతలకు శాశ్వతంగా దూరం అయ్యారు.
చిరుకు రచయితగా ఎన్నో బ్లాక్బస్టర్లు ఇచ్చిన యండమురికి చిరంజీవి దర్శకత్వ బాధ్యతలు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే యండమూరి ఖచ్చితంగా సూపర్ హిట్ చేస్తాడన్న నమ్మకంతో చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు ... కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది. అయితే చిరంజీవి రాజకీయాలకు వచ్చి ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక యండమూరి రాజకీయాల్లోకి వద్దని వారించారు. సినిమాలు వేరు ... రాజకీయాలు వేరు ఇక్కడ సక్సెస్ అవ్వటం కష్టమని చెప్పారు. అది చిరంజీవికి నచ్చలేదట. దాంతో చిరంజీవి బాగా హర్ట్ అయ్యారు. అప్పటినుంచి యండమూరి ని దూరం పెట్టారు. సొంత పార్టీ పెడుతున్నప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారు సపోర్ట్ చేయలే గాని ... ఇలా వద్దని సలహా ఇవ్వటం ఏంటని ? చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత చిరంజీవి కుటుంబానికి ... చిరంజీవి అభిమానులకు యండమూరి బాగా టార్గెట్ అయ్యారు. నాగబాబు కూడా యండమూరిని ఎన్నోసార్లు టార్గెట్ చేశారు.. ఇలా యండమూరి వర్సెస్ చిరంజీవి మధ్య ఈ గ్యాప్ చాలా ఏళ్లపాటు అలాగే కొనసాగుతూ వచ్చింది.