సూర్య కంగువలో ప్రభాస్.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్టులు.. ఇక బాక్స్ ఆఫీస్ కు దబిడి దిబిడే..!

Amruth kumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య దగ్గర నుంచి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులు ముందుకు రాబోతున్న మూవీ 'కంగువ' .. 2022లో ఆయన ఈటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కమర్షియల్ గా డిజాస్టర్ అయింది. అంతకు ముందు తీసిన సినిమాలు కూడా వరుస డిజాస్టర్లు గా మిగిలాయి. ఈ మధ్యకాలంలో అభిమానులకు సూర్య నుంచి స‌రైన‌ పాత్ర వ‌చ్చింది అంతే అది రోలెక్స్ పాత్ర మాత్రమే. కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ మూవీ క్లైమాక్స్లో కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆ పాత్రలో ఆయన కనిపిస్తాడు. అ ఐదు నిమిషాల పాత్ర సినిమాని మరో లెవల్ కు తీసుకువెళ్లింది. నటనపరంగా అంత వైవిధ్యం ఉన్న సూర్యని తమిళ దర్శకులు సరిగ్గా వాడుకోవట్లేదని అభిమానులు కూడా ఫీలవుతున్నారు. ఇలాంటి క్రమంలోనే సూర్య కంగువ మూవీని ప్రకటించాడు.

కోలీవుడ్ స్టార్ట్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది. ఇక నిజానికి ఈ మూవీ దసరాకే ప్రేక్షకుల ముందుకు రావాలి .. కానీ ఆ స‌మ‌యంలో రజనీకాంత్ ‘వెట్టియాన్’ మూవీ విడుదలవడంతో క్లాష్‌ రావటం ఇష్టం లేక సినిమాని వాయిదా వేయించాడు సూర్య. అయితే ఈ సినిమా మీద కేవలం సూర్య అభిమానుల్లో మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో క్రేజ్ ఉంది. అంతేకాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ ఇది మా బాహుబలి అని కూడా చెప్పుకుంటుంది. అలాగే సూర్యకి సౌత్ లో కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగు,  మలయాళం లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన మార్కెట్ ని సరిగా ఉపయోగించుకునే సినిమా రాకపోవడం వల్ల సూర్య బాగా వెనకబడ్డాడు కానీ కంగువతో ఆయన మళ్ళీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు బలంగా ఆశపడుతున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టుగా లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఆయన డబ్బింగ్ చెప్పబోతున్నారట.  సూర్య - ప్రభాస్ మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెలిసిందే.. గతంలో సూర్య సినిమా తెలుగులో విడుదలవుతున్న సందర్భంలో ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా కూడా వచ్చి శుభాకాంక్షలు చెప్పాడు. ఇలా వీరిద్దరి మధ్య గతంలో ఎన్నో సంఘటనలు కూడా జరిగాయి.  ఆ చనువుతోనే కంగువ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.  ఈ వార్తతో మరింత అంచనాలను రెట్టింపు చేసింది. టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సూర్య ‘కంగువ’ అనే అడవి వీరుడిగా, గూఢచారి గా ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో సూర్య భారీ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: