ఆ దర్శకుడి కారణంగా బ్లాక్ బాస్టర్ మూవీని వదిలేసిన బాలయ్య.. కమిట్మెంట్ అంటే ఇది కదా..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటి వరకు చాలా సినిమాలను వదులు కున్న విషయం మన అందరికీ తెలిసిందే . అలా నాగార్జున కెరియర్లో బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచిన ఓ సినిమాను కూడా బాలయ్య వదులుకున్నాడు . అసలు ఆ సినిమా ఏది ..? ఆయన ఎందుకు ఆ సినిమాను వదులుకున్నాడు అనే వివరాలను తెలుసు కుందాం . చాలా సంవత్సరాల క్రితం నాగార్జున హీరో గా విజయశాంతి హీరోయిన్గా కే రాఘవేంద్రరావు దర్శకత్వం లో జానకి రాముడు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది.

ఇకపోతే ఈ సినిమాను మొదట కోడి రామకృష్ణ , బాలకృష్ణ హీరోగా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించగా ఆయన కూడా కోడి రామకృష్ణ దర్శకత్వంలో జానకి రాముడు సినిమా కథతో మూవీ చేయాలి అనుకున్నాడట. ఇక కొంత కాలం ముగిసాక ఈ కథ కోడి రామకృష్ణ దగ్గర నుండి రాఘవేందర్రావు దగ్గరకు వెళ్ళిందట. దానితో కోడి రామకృష్ణ తో చేయాలి అనుకున్న కథ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లడంతో బాలకృష్ణ కూడా ఆ సినిమాను పక్కన పెట్టేసాడట.

దానితో రాఘవేందర్రావు ఆ కథతో నాగార్జున హీరోగా విజయశాంతి హీరోయిన్గా జానకి రాముడు అని టైటిల్ తో మూవీ ని రూపొందించారట. అలా కోడి రామకృష్ణ తో బాలయ్య చేయాలి అనుకున్న సినిమా రాఘవేందర్రావు , నాగార్జున హీరోగా రూపొందించాడట. ఈ మూవీ ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ తో నాగార్జున , విజయశాంతి , రాఘవేంద్రరావు కి మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: