ఆ దర్శకుడి మాటతో చరణ్ లో సడన్ మార్పు.. దెబ్బకు సినిమాల ఎంపిక మొత్తం మారిపోయిందా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక చిరుత మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన చరణ్ మొదటి సినిమాలోనే తన అద్భుతమైన నటనతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత చరణ్ హీరోగా రూపొందిన మగధీర సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకోవడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే చరణ్ కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం మాస్ మసాలా , రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లలో నటిస్తూ వచ్చాడు. 

ఇక వాటితోనే విజయాలను కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించే కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయం లో ఒక సారి దర్శకుడు మణిరత్నం , చరణ్ నీ దగ్గర అద్భుతమైన కెపాసిటీ ఉంది. ఏ పాత్రలోనైనా నటించే క్యాపబిలిటీ ఉంది. 

అయిన ఎందుకు ఇలాంటి రొటీన్ కమర్షియల్ సినిమాలలో నటిస్తున్నావు. నువ్వు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలలో నటించు. నీకు నటుడిగా అద్భుతమైన గుర్తింపు వస్తుంది అని చెప్పాడట. దానితో చరణ్ అప్పటి నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఉన్న కథలను ఓకే చేస్తూ వస్తున్నాడట. అలా మణిరత్నం చెప్పిన మాటతో చరణ్ రొటీన్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ కథాంశాలతో రూపొందే సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: