విజయ్ దేవరకొండ కి గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన నయనతార.. ఇది లైఫ్ లో మర్చిపోలేడుగా..!?

Thota Jaya Madhuri
విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరో.  ఇండస్ట్రీకి వచ్చిన చాలా చాలా తక్కువ టైంలోనే స్టార్ డమ్ దక్కించుకున్నాడు.  మరీ ముఖ్యంగా అభిమానులు ముద్దుగా రౌడీ హీరో అంటూ పిలుచుకుంటూ ఉంటారు .  ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్న విజయ్ దేవరకొండ లాస్ట్ గా "ఫ్యామిలీ స్టార్" అనే సినిమాలో నటించాడు.  ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . అంతేకాదు ఈ సినిమా రిజల్ట్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని సైతం తీవ్రంగా హర్ట్ చేసింది .
పరశురాంపేట్ల ఇంత చెత్తగా తెరకెక్కించాడు ఏంటి ..? అంటూ విజయ్ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు . విజయ్ దేవరకొండ తో సినిమా అంటే ఏ హీరోయిన్ కూడా అస్సలు నో చెప్పదు అన్న కామెంట్స్ మనం ఎప్పటినుంచో వింటున్నాం . అయితే ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న నయనతార మాత్రం విజయ్ దేవరకొండ సినిమాను స్టోరీ వినకుండానే రిజెక్ట్ చేసిందట . ఆ సినిమా మరేంటో కాదు "గీతగోవిందం".
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గీతగోవిందం సినిమాలో నిత్యామీనన్ గెస్ట్ పాత్రల్లో కనిపిస్తుంది నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా నయనతారను ఎంపిక చేసుకున్నారట డైరెక్టర్ . కానీ నయనతార గెస్ట్ పాత్రలో నేను నటించాలా నో వే అంటూ అసలు స్టోరీ వినకుండా హీరో విజయ్ దేవరకొండ  అని  తెలిసిన కూడా రిజెక్ట్ చేసేసిందట . సీన్ కట్ చేస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . విజయ్ దేవరకొండ - రష్మిక కెరియర్ను మార్చేసిన సినిమా గీతగోవిందం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ విధంగా చెప్పాలి అంటే విజయ్ దెవరకొండ కి ననయ్ బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: