చిరుతో వచ్చిన మొదటి అవకాశాన్ని బాబి ఎందుకు వదులుకున్నాడో తెలుసా.. అంత పెద్ద స్టోరీ జరిగిందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి ఒకరు. ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన పవర్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో కొన్నింటితో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుదిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం బాబి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాకి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా కంటే ముందు బాబి కి చిరంజీవి తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చిందట. దానిని ఆయన రిజెక్ట్ చేశాడట. ఆ విషయాలను ఆయన ఓ ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు. బాబి ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... చిరంజీవి గారు నన్ను మొదట ఒక రీమిక్ సినిమా కోసం వినిపించారు. కానీ నేను ఆ రీమేక్ సినిమా చేయను అని చెప్పాను. అలాగే నేను చిరంజీవి గారితో నేను రాసుకున్న కథలతో సినిమా చేస్తాను అని చెప్పాను. దానితో వెంటనే ఆయన ఒక కథ చెప్పు అన్నాడు. నాకు కొంత టైమ్ ఇవ్వండి సార్ చెబుతాను అన్నాను.

ఇక కొన్ని రోజుల తర్వాత వెళ్లి వాల్టేర్ వీరయ్య సినిమా కథను చిరంజీవి గారికి చెప్పాను. ఆయన ఓకే అన్నాడు. అలా నన్ను రీమిక్ సినిమా కోసం చిరంజీవి గారు పిలిపించగా నేను మాత్రం సొంత కథతో సినిమా చేస్తాను అని చెప్పి ఒక కథను తయారు చేసి ఆయనను వినిపించి సినిమాకు ఒప్పించాను అని బాబి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే బాబీ ప్రస్తుతం బాలయ్య హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: