చిరంజీవి పెద్ద కూతురు ఆ స్టార్ హీరోతో కలిసి నటించిందా.. ఆ మూవీ స్టోరీ ఇదే..!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో అడుగుపెట్టి టాలీవుడ్ కే మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ఆయన పేరుతో ఓ పెద్ద సామ్రాజ్యాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా గొప్ప మనిషిగా పేరు పఖ్యాతలు సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇక్కడ మెగా కుటుంబం నుంచి హీరోలుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా మంది సక్సెస్ సాధించారు. అయితే మెగా ఆడపడుచులు మాత్రం ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అంత సక్సెస్ సాధించలేకపోయారని చెప్పాలి.


మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఆమె చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోవడంతో తిరిగి నిర్మాతగా స్థిరపడ్డారు నిహారిక. ఒకవైపు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ అలాగే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో పని చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూ నిర్మాతగా కూడా స్థిరపడుతున్నారు.


ఈమె పలు సినిమాలను వెబ్ సిరీస్‌ నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే. సుస్మిత  కూడా ఒక సినిమాలో హీరోయిన్గా నటించారు.. సుస్మితను  హీరోయిన్గా పరిచయం చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉండటంతో చిరంజీవి ఆ ఆలోచనను విరమించుకున్నారట. ఇక ఈమె హీరోయిన్గా ఓ సినిమాలో మాత్రం నటించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవటంతో రిలీజ్ కాలేదట. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో సుస్మిత - ఉదయ్ కిరణ్ జంటగా ఓ సినిమాలో నటించారట. ఫస్ట్ హ‌ప్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ మూవీ సెకండ్ హాఫ్ కంప్లీట్ కాకపోవటంతో ఈ సినిమా అలాగే మిగిలిపోయింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఉంటే సుస్మిత లైఫ్ మరో లాగా ఉండేదని కూడా పలువులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: