లిప్ కిస్ల ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. శారీరకంగానే కాదు మానసికంగా కూడా..?
ప్రేమించుకున్న వ్యక్తులు కిస్ పెట్టుకోవడం , హగ్ చేసుకోవడం , ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంటాయి అని తెలుస్తుంది. ఇలా శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల కావడం అనేక మంచి పరిణామాలకు దారితీస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ముద్దులతో శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముద్దులు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఉంటుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముద్దులు పెట్టుకోవడం వల్ల దంతాలు కూడా చాలా బాగుంటాయి అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ముద్దులు పెట్టుకునే ప్రక్రియలో ఒకరి లాలాజలం మరొకరి లోపలికి వెళ్లడం వల్ల దంతాలు బలంగా అవుతాయి అని తెలుస్తోంది.
ఇక ముద్దులు పెట్టుకోవడం వల్ల శారీరకం గానే కాకుండా మానసికంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముద్దులు పెట్టుకునే ప్రాసెస్ లో మనిషి శరీరంలో ఆనందాన్ని కలిగించే ఎండార్ఫిన్ ఉత్పత్తి అవుతాయట. దీనివల్ల మనిషి ఎంతో ఆనందంగా ఉంటాడు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల జంట మధ్య ప్రేమ పెరగడం మాత్రమే కాకుండా శారీరకంగా , మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.