అలా చేస్తే వైల్డ్ కార్డుల్లోనే టైటిల్ విన్నర్..!

shami
బిగ్ బాస్ సీజన్ 8 లో గడిచిన ఐదు వారాల్లో ఇప్పటివరకు ఉన్న కంటెస్టెంట్స్ లో విన్నర్ క్వాలిటీస్ ఎవరికి లేవు అన్నట్టుగా అనిపించింది. ఎందుకో ఈ సీజన్ అంతా కంటెస్టెంట్స్ ఆర్టిఫిషియల్ గా కనిపిస్తున్నారు. షోలో ఎలా ఉంటే ఆడియన్స్ నుంచి ఓటింగ్ వస్తుందో ముందే బాగా ప్రిపేర్ అయ్యి హౌస్ లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఐతే ఉన్నంతలో నిఖిల్ కాస్త టైటిల్ కొడతాడు అనిపించగా అతని పక్కన సోనియా చేరి మొన్నటిదాకా అతని ఆటని చెడగొట్టేసింది. సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ మళ్లీ తన ఆట మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు.
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత షో ఆసక్తికరంగా మారింది. ఈసారి వైల్డ్ కార్డ్ లను పాత సీజన్ లో కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఐతే అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అన్నది చూడాలి. ఐతే ఇప్పటివరకు జరిగిన ఐదు వారాల కన్నా ఈ వారం అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చాక షో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.
ఇప్పుడు ఉన్న బజ్ చూస్తుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోనే విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నట్టు ఉంది. లాస్ట్ సీజన్ నుంచి వచ్చిన గౌతం తో పాటు సీజన్ 4 నుంచి అవినాష్, మెహబూబ్ ఇంకా సీజన్ 1 నుంచి వచ్చిన హరితేజ ఉన్నారు. వీరితో పాటు గంగవ్వ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. లాస్ట్ టైం ఐదు వారాలకే హౌస్ ని విడిచి వెళ్లిన గంగవ్వ ఈసారి చివరి దాకా ఉండాలని అనుకుంటుంది. ఎలాగు వచ్చింది ఆరో వారానికి కాబట్టి ఒక 10 వారాలు ఉంటే సరిపోతుంది. ఇక వైల్డ్ కార్డ్ గా వచ్చిన రోహిణి, నయని పావని, టేస్టీ తేజా వీరికి టైటిల్ విన్నర్ అయ్యేంత స్టఫ్ ఉందని చెప్పలేం. మరి ఈసారి వైల్డ్ కార్డ్ లో ఎవరైనా టైటిల్ కొడతారా లేదా ముందు నుంచి ఉన్న కంటెస్టెంట్ టైటిల్ కొడతారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: