కాంతార1 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య వార్ తప్పదా?

Reddy P Rajasekhar
2025 సంవత్సరంలో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమాలలో వార్2 సినిమా ఒకటి. హృతిక్ రోషన్, తారక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ లో సల్మాన్ ఖాన్ తో పాటు మరో హీరో ఎంట్రీ ఇస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.
 
ఈ సినిమా 2025 సంవత్సరం ఆగ్ష్టు 14వ తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. అయితే కాంతార ఛాప్టర్1 కూడా 2025 ఆగష్టులోనే రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. డేట్ గురించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా సినిమా మాత్రం అదే సమయానికి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే.
 
వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఒకింత సంచలనం అవుతుంది. అయితే పెద్ద సినిమాలకు సంబంధించి మంచి డేట్ ను మిస్ చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించరనే సంగతి తెలిసిందే. వార్2, కాంతార1 సినిమాల విషయంలో చివరకు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
 
వార్2 మూవీ షూటింగ్ జనవరి సమయానికే పూర్తి కానున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదు. కాంతార1 రిలీజ్ డేట్ ప్రకటించలేదు కాబట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు చేస్తే మంచిది. ఈ విషయంలో మేకర్స్ ఆలోచన ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న పాన్ ఇండియా సినిమాలన్నీ సక్సెస్ సాధించి టాలీవుడ్ స్థాయిని పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వార్2 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందనే సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: