కూల్ గా ఉంటే మహేష్ కు ఆ హీరోయిన్ చూస్తే ఒళ్ళు మంట.. ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసి పడేసాడు.. ఎందుకంటే..?
మహేష్ బాబు చాలా చాలా సాఫ్ట్ .. ఎక్కడ కూడా రూడ్ గా మాట్లాడడు. ఎదుటి వాళ్లు హర్ట్ అయ్యే విధంగా అస్సలు మాట్లాడడు. కానీ తనను ఏదైనా అంటే మాత్రం అక్కడికక్కడే ఇచ్చి పడేస్తాడు. పలు ప్రెస్ మీట్ లల్లో మహేష్ బాబుకి మండించే ప్రశ్నలు వేసినప్పుడు ఎలా రిపోర్టర్స్ కి తగలాల్సిన చోట తగిలేలా మాట్లాడుతాడో మనకు తెలిసిందే. అలాంటిది మహేష్ బాబుకు ఒక హీరోయిన్ పిచ్చ కోపం తెప్పించిందట. ఇక ఊరుకుంటాడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు సినిమా ఆఫర్లు వస్తే రిజెక్ట్ చేశాడు. ఇప్పటివరకు ఆ హీరోయిన్ తో సినిమానే చేయలేదు .
ఆ హీరోయిన్ మరెవరో కాదు "నయనతార". ఎస్ సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార అంటే మహేష్ బాబుకి విపరీతమైన కోపం . దానికి కారణం కూడా ఉంది . నయనతార మొదటి నుంచి సినిమా ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వదు . అంతేకాదు సినిమా షూటింగ్స్ లో ఆమె పెద్ద తోపు అనే రేంజ్ లో బిహేవ్ చేస్తూ ఉంటుందట . ఈ విషయాన్ని చాలామంది తమిళ స్టార్ లు కన్ఫామ్ చేశారు . అయితే మహేష్ బాబు తో సినిమాలో నటించే ఆఫర్ వచ్చినప్పుడు నయనతార ప్రమోషన్స్ కి రాను అంటూ కండిషన్స్ పెట్టిందట . మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన అవకాశం రావడమే పెద్ద విషయం. అలాంటిది ఆయన సినిమాకి కండిషన్స్ పెడితే ఊరుకుంటాడా..? సినిమా నుంచి ఆమెను తీసి పక్కన పడేసాడు . ఆ తర్వాత కూడా రెండు బడా సినిమాలలో ఆఫర్ వచ్చాయి . అయినా సరే మహేష్ బాబు - నయనతారను యాక్సెప్ట్ చేయలేదు . ఇకపై యాక్సెప్ట్ చేస్తాడు అన్న నమ్మకాలు కూడా లేవు . మహేష్ బాబు - నయనతారను తెర పై కలిసి చూడాలి అన్న ఆశను వదులుకోవడమే బెటర్..!