విజయ నిర్మల తర్వాత కృష్ణ ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఇంట్లో గొడవ.. చివరికి.?

Pandrala Sravanthi
సూపర్ స్టార్ కృష్ణ అంటే సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఒకానొక సమయంలో ఈయన సంవత్సరానికి 10, 15 సినిమాలను చేస్తూ ఒకే ఏడాది సినిమాలను రిలీజ్ చేసేవారు. అలా దాదాపు నాలుగైదు షిఫ్టుల్లో ఎంతో బిజీగా పని చేసే సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఉన్నన్ని రోజులు సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోకుండా ఈయన తన సినీ కెరియర్ ని ఎంతో సక్సెస్ఫుల్ గా కొనసాగించారు. అయితే అలాంటి సూపర్ స్టార్ కృష్ణ సొంత మేన మరదలు అయినటువంటి ఇందిరా దేవిని పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చాక కూడా  హీరోయిన్ విజయ నిర్మలని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే విజయనిర్మలకు కూడా అది రెండో పెళ్లే.. ఇక విజయనిర్మలను పెళ్లి చేసుకునే సమయంలో ఇందిరా దేవికి విడాకులు ఇస్తానని నిర్ణయించుకున్నారట. కానీ ఇందిరా దేవి నాకు భర్తగా ఉండకపోయినా పర్వాలేదు కానీ విడాకులు మాత్రం ఇవ్వకండి అని కండిషన్ పెట్టిందట. 

ఆమె కండిషన్ కి ఒప్పుకున్న కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఇందిరా దేవిని కూడా భార్యగానే చూశారు. అయితే అలాంటి కృష్ణపై ఇండస్ట్రీలో విజయనిర్మల తర్వాత ఎలాంటి రూమర్ లేదు.కానీ ఒక్క రూమర్ మాత్రం ఆయనపై ఎక్కువగా వినిపించింది. అదేంటంటే జయప్రదతో క్లోజ్ నెస్.. సూపర్ స్టార్ కృష్ణ జయప్రద కాంబినేషన్లో దాదాపు 40 సినిమాలు రావడంతో వీరిద్దరి మధ్య  కుచ్ కుచ్ హోతా హై అంటూ ఇండస్ట్రీ జనాలందరూ మాట్లాడుకున్నారు.. అయితే ఒక హీరో హీరోయిన్ కలిసి ఈ జనరేషన్ లో రెండు సినిమాలు చేస్తేనే ఎన్నో రూమర్లు వినిపిస్తాయి. అలాంటిది ఆ జనరేషన్ లో 40 సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు. అలా 40 సినిమాలు చేసే క్రమంలో జయప్రదకి కృష్ణకి మధ్య ఏదో జరుగుతుంది అనే రూమర్ వినిపించడంతో చాలామంది వీరిపై గాసిప్ వార్తలు క్రియేట్ చేశారు.

కానీ జయప్రదతో కృష్ణకి మంచి కంఫర్ట్ ఉండేది. ఇక ఇన్ని సినిమాల్లో కలిసి చేశారంటే వీరిద్దరి మధ్య కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్లే ఆ కాంబినేషన్ ఎక్కువ సినిమాలు కుదిరింది అని చెప్పుకోవచ్చు. అలా కృష్ణ జయప్రదని సినిమాల పరంగా మంచి కాంబో అని ఇష్టపడేవారు అందుకే వీరి కాంబోలో అన్ని సినిమాలు వచ్చాయట.అలాగే వీరిద్దరి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రావడంతో వీరిద్దరి మధ్య అఫైర్ నడుస్తుంది అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అంటూ అప్పటి సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: