దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చిన ధీరుడు రాజమౌళి..'స్టూడెంట్ నెం.1' సినిమాతో తన సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసిన రాజమౌళి వరుస గా సూపర్ హిట్ మూవీస్ అందిస్తూ వస్తున్నాడు... తన 23 ఏళ్ల కెరీర్‌లో తీసింది 12 సినిమాలే అయినా భారీ విజయం అందుకున్నాయి..తన అద్భుతమైన టాలెంట్ తో హాలీవుడ్ దిగ్గజ దర్శకులను సైతం రాజమౌళి మెప్పించాడు..అప్పటి వరకు కమర్షియల్ సినిమాలు తీసిన రాజమౌళి మగధీర సినిమాతో సరికొత్త ఒరవడి సృష్టించాడు.. ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది.. దీనితో రాజమౌళి పై అంచనాలు తారా స్థాయికి చేరాయి.. దీనితో రాజమౌళి ఒక చిన్న సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాడు..ఆ సినిమా కోసం రాజమౌళి పడరాని పాట్లు పడ్డారట.. ఆ సినిమా ఏదో కాదు నాని హీరోగా నటించిన ‘ఈగ’..'ఈగ’ టైటిల్ రోల్‌లో ఓ సినిమా తీయాలనే ఆలోచన రాజమౌళికి డైరెక్టర్ అవ్వక ముందు నుంచే ఉందట. అయితే ఇతర దర్శకుల వలె రొమాంటిక్, కామెడీ, హారర్ వంటి జానర్లు రాజమౌళికి అసలు నచ్చవు.వాటిపై ఆయనకు అవగాహన కూడా లేదట. అందుకే వాటి జోలికి వెళ్లకుండా ఓ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేద్దాం అనుకున్నారు.. అలా ఆలోచిస్తున్న టైమ్‌లోనే ఆయనకు మరోసారి "ఈగ" కాన్సెప్ట్ జ్ఞాపకం వచ్చింది.
ఈగ వంటి చిన్న ప్రాణి మనిషిపై పగ తీర్చుకోవడం అంటే చాలామందికి ఎంతో క్యూరియాసిటీ కలుగుతుందని రాజమౌళి అనుకున్నాడు. కేవలం రూ.2.5 కోట్లలో ఈ సినిమాను రూపొందించి కొన్ని ప్రాంతాల్లోనే విడుదల చేద్దామని ప్లాన్ చేశాడు. కానీ ఆ లిమిటెడ్ బడ్జెట్‌లో ఆ సినిమా తీయడం అసలు సాధ్యపడలేదు..అప్పుడు నిర్మాత సురేష్‌బాబు బడ్జెట్ గురించి పట్టించుకోకుండా గురించి పట్టించుకోకుండా, కథ సిద్ధం చేయండి' అని రాజమౌళితో అన్నారు.. దాంతో రాజమౌళి స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకున్నాడు.. స్క్రీన్ ప్లే పై పూర్తి దృష్టి పెట్టారు.. ఈగ లపై పరిశోధనలు చేసారు..ఈగ సినిమాను అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించాలని రాజమౌళి భావించాడు.. దీనితో బడ్జెట్ భారీగా అయింది. .రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి 'ఈగ' సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 2012 జులై 6న విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది..