ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి.. హీరోయిన్ ప్రియమణికి ఉన్న లింక్ ఇదే..

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రియమణి కూడా ఒకరు. అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత వరుస‌ సినిమాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసింది.  కేవలం గ్లామర్ షోస్ మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తెలుగు , తమిళ భాషల్లోనే ఎన్నో సినిమాల్లో నటించిన ప్రియమణి .. హిందీలో కూడా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది. ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ .. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుంది.

అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రియమణికి సంబంధించిన ఒక వార్త చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే.. ప్రియమణికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కజిన్ సిస్టర్ ఉన్నారట.. అవును ఆమె కూడా బాలీవుడ్ నుంచి కొలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇంత‌కి ఆ హీరోయిన్ ఎవరనేది ఇక్కడ చూద్దాం. ఇక ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు విద్యాబాలన్ , ఈమె ప్రియమణికి వరుసకు అక్క అవుతారు. వీరిద్దరూ బలమైన పాత్రల ద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే గతంలో ప్రియమణి - విద్యాబాలన్ గురించి చేసిన వీడియో వైరల్ గా మారింది. విద్యాబాలన్ తాను దగ్గర బంధువులే అని ఆమె చెప్పింది. అలాగే తన తాతయ్యతో ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చింది. విద్యాబాలన్ తన తండ్రి వైపు నుంచి తన రెండవ కోడలు అని చెప్పింది. అయితే ఇప్పటి వరకు మనం ఒకరినొకరు రెండు సార్లు మాత్రమే చూశామని తెలిపింది. మొదటగా ఓ అవార్డు వేడుకలో కనిపించిందని .. ఆరోజు విద్యాబాలన్ తనకు అవార్డ్ అందించిందని తెలిపింది. విశాఖపట్నంలో జరిగిన ఒక అవార్డు వేడుకలో తాము తొలిసారిగా కలుసుకున్నామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: