దేవ‌ర‌ తో సహా టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ సినిమాలు ఇవే..!

Amruth kumar
ఇప్పుడు మన తెలుగు సినిమా స్థాయి భారతీయ సినిమా ప్రపంచంలోనే నెంబర్ 1న్ స్థానంలో ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు గురించి మాత్రమే చెప్పుకునేవారు.. అక్కడ విడుదల చేసిన వాళ్లకి వందల కోట్ల కలెక్షన్లు వచ్చేయమని అనేవారు. అయితే బాహుబలి తో తెలుగు సినిమా స్థాయి బాలీవుడ్ కన్నా పెరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ లో వర్ష పాణ్యం సినిమాలు వస్తున్నాయి.. భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి కూడా దర్శక నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో వచ్చే పాన్ ఇండియా సినిమాలు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ కలెక్షన్లు అందుకున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ సినిమాలలో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ అనేది మన తెలుగు సినిమాకి ఎంతో సింపుల్ అయిపోయింది. తొలిరోజే మన తెలుగు సినిమాలు 100 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎలా ఉంచితే తెలుగు చిత్ర పరిశ్రమలో మొదట వారమే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఏమిటో.. అందులో దేవ‌ర‌ ఏ ప్లేస్ లో ఉంది ఇక్కడ చూద్దాం.


బాహుబలి 2 : ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ‘బాహుబలి 2’.. మొదటి వారం వరల్డ్ వైడ్ రూ.816.3 కోట్లు గ్రాస్ ను రాబట్టి.. ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్..లు హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా కమ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.709.22 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. కల్కి 2898 ad : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.658.66 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి.. నాన్- రాజమౌళి రికార్డ్స్ కొట్టింది. సలార్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటి వారం రూ.485.52 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

 ఆదిపురుష్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ కి చెందిన ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ.. మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.356.8 కోట్లు గ్రాస్ ను రాబట్టింది. సాహో : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.351.08 కోట్లు గ్రాస్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది.  ‘దేవర’ : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.338.25 కోట్లు గ్రాస్ ను రాబట్టింది.

బాహుబలి(ది బిగినింగ్) : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి’ తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.220.6 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. పుష్ప(పుష్ప ది రైజ్) : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ ‘ఆర్య 2’ వంటి చిత్రాల తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.195.18 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి టాప్ 10లో చోటు సంపాదించుకుంది. సైరా : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.186.56 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: