నితిన్ సినిమాకు ఈ ఐదుగురి నటుల చావుకు.. కారణం ఇదే..!

Amruth kumar
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమల్లో యంగ్ హీరో నితిన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. అతి చిన్న వయసులోని ఇండస్ట్రీలో అడుగుపెట్టి అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. వరుస‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన యాక్టింగ్ , డాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేస్తాడు. ఇక 2003లో వి.వి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన దిల్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకి అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేసిన స్టార్ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాతోనే ఆయనకు దిల్ రాజు అనే పేరు కూడా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నితిన్ స్టార్ హీరోగా మారాడు. అలాగే ఈ సినిమాలో నితిన్ , నేహా ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో నితిన్ తో నటించిన ఐదుగురు నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ నటులు ఎవరు ఇక్కడ చూద్దాం.

ఇక ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించిన సీనియర్ నటుడు చలపతిరావు ఈ మధ్య కాలంలోని గుండుపోటుతో మరణించారు. ఎన్టీఆర్ , నాగేశ్వరరావు కాలం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ టాలీవుడ్ లోనే గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరో మావయ్యగా అందరూ మర్చిపోలేని పాత్రలో నటించారు కమీడియన్ వేణుమాధవ్ .. ఈయన కూడా ఇంకా చాలా కెరియర్ ఉంది కానీ అతి చిన్న వయసులో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 49 ఏళ్ళ వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అలాగే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు ఆహుతి ప్రసాద్.. చాలా సినిమాల్లో ఆహుతి ప్రసాద్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఈయన కూడా 2015లో 57 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా మరణించారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.  ఈ సినిమాలో నటించిన ఆహుతి ప్రసాద్ మరణించిన కేవలం 30 రోజులకే ఇదే సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించి కడుపుబ్బా నవ్వులు పూయించిన ఎమ్మెస్ నారాయణ కూడా 2015లో 63 ఏళ్ల వయసులో మరణించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కు తాత పాత్రలో నటించిన రాజన్ పీ దేవ్ కూడా అతి తక్కువ వయసులోనే మరణించారు. ఈయన మలయాళ నటుడు కానీ మన టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు నటించారు. ఈయన కూడా 58 ఏళ్ల వయసులో 2009లో అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇలా టాలీవుడ్ ఎంతోమంది టాలెంట్ ఉన్న నటులను కోల్పోయింది. దాంతో ప్రస్తుతం ఇతర భాషల నటులను తెచ్చుకోవడానికి చిత్ర పరిశ్రమ దిగజారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: