అన్ని ఉన్న అక్కడే ఆ బ్యూటీకి తేడా కొట్టింది.. నెక్స్ట్ ఆప్షన్ అవే..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఐఏఎస్ అవ్వాలి అని ఎంతో ఆశపడిందట. కానీ అనుకొని పరిస్థితుల వల్ల ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగం వైపు ఎంట్రీ ఇచ్చిందట. అలా మోడలింగ్ రంగంలో సూపర్ సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె ఈచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

అయినా ఈమెకు అవకాశాలు తెలుగులో వచ్చాయి. అందులో భాగంగాబి బ్యూటీ ఇచట వాహనములు నిలపరాదు సినిమా తర్వాత కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో ఈ బ్యూటీ తన అందాలను విపరీతంగా ఆరబోసింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈమెకు మాత్రం అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈమెకు మొదటి విజయం తెలుగులో అడవి శేషు హీరోగా శైలేష్ కొలను హీరోగా రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ ద్వారా లభించింది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. కొంత కాలం క్రితం ఈమె తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన గోట్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈమె పాత్రకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మట్కా , లక్కీ భాస్కర్ , మెకానిక్ రాకీ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు మూవీలు ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి. ఈ మూడు మూవీలలో కనీసం ఏ రెండు సినిమాలైనా మంచి విజయాలు సాధిస్తే ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అందం అభినయం నటన అన్ని ఉన్నా కూడా సరైన విజయాలు లేకపోవడంతో మీనాక్షి కి మంచి గుర్తింపు దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc

సంబంధిత వార్తలు: