' దివ్య భారతి ' పై మోజుపడి సినిమా తీసి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత..!
ఇక చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తీలో తీసిన అందమైన వెన్నెలలోనా పాటకే మోహన్ బాబు చాలా ఖర్చు చేశారట. ఈ పాటను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన రసరాజు రచించారు. ఇక అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ షేక్ అయింది. ఆ వెంటనే మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అని పేరు స్థిరపడిపోయింది. ఇందులో హీరోయిన్ గా చేసిన దివ్య భారతి ని చూసి ఇటు సినీ వర్గాలు, అటు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.
దాంతో నెక్స్ట్ ఇయర్ ఇదే కాంబినేషన్ లో చిట్టెమ్మ మొగుడు అనే సినిమాను తెరకెక్కించారు. ఇది కూడా తమిళ రీమేక్..కథ మీద అంత నమ్మకం లేక మోహన్ బాబు కాకుండా పి.శ్రీధర్ రెడ్డి ఈ చిట్టెమ్మ మొగుడు సినిమా ను నిర్మించారు. జస్ట్ నిర్మాత మాత్రమే మారాడు తప్ప మిగతా యూనిట్ సభ్యులందరూ సేం టు సేం గా ఉన్నారు. అయితే, అసెంబ్లీ రౌడీలో దివ్య భారతిని ఎంతగా ఆదరించారో చిట్టెమ్మ మొగుడులో మాత్రం దానికి భిన్నంగా వ్యతిరేకించారు మన ప్రేక్షకులు.. చిట్టెమ్మ గా దివ్య భారతిని చూడలేకపోయారు. ఇలా దివ్య భారతి కోసం సినిమా తీసి నిర్మాత నిండా మునిగిపోయాడు.