ఏంటి ఇలియానా నిజంగానే విడాకులు తీసుకోబోతుందా. అసలు పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటివరకు షేర్ చేయని ఈ ముద్దుగుమ్మ నిజంగానే డైవర్స్ తీసుకోబోతోందా.. ఇంతకీ ఇలియానాకి తన భర్తతో ఎక్కడ గొడవలు వచ్చాయి ..ఆమె విడాకులకు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు చిన్నచిన్న గొడవలకే విడాకులు, బ్రేకప్ లు అంటూ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు అయితే అసలు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారో విడాకులు ఎందుకు తీసుకుంటారో కూడా అర్థం కాదు. అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో జంట విడాకులకు రెడీ అయినట్టు తెలుస్తోంది.ఇక వాళ్ళు ఎవరో కాదు ఇలియానా మైఖేల్ డోలన్ .. పెళ్లి కాకుండానే తల్లైంది అని ఇలియానా పై ఆ మధ్యకాలంలో ఎన్ని రూమర్లు వచ్చాయో చెప్పనక్కర్లేదు. ఇక బిడ్డ పుట్టే వరకు కూడా తన భర్తకు సంబంధించిన డీటెయిల్స్ గాని ఫోటోలు గాని బయట పెట్టలేదు.
బిడ్డ పుట్టిన వెంటనే పేరు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ బిడ్డ జన్మకి కారణమైన వ్యక్తిని మాత్రం పరిచయం చేయలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు తనకు పుట్టిన కొడుకుకి తండ్రి మైఖేల్ డోలన్ అని చెప్పింది.దీంతో చాలా మంది నెటిజన్స్ ఇలియానా ప్రెగ్నెంట్ అవ్వడంతో సీక్రెట్ గా మైకేల్ డోలన్ ని వివాహం చేసుకుంది అని భావించారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా ఖాతాలో కొడుకుకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఉన్నట్టుండి సడన్గా ఇలియానా విడాకులు తీసుకోబోతుంది అని బీటౌన్ లో ఒక వార్త వైరల్ గా మారడంతో చాలామందిని నెటిజన్స్ ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.అయితే ఇలియానా కి ఆమె భర్త కి మధ్య కొడుకు బాధ్యతలు చూసుకునే విషయంలో గొడవలు జరుగుతున్నాయని,అంతేకాకుండా ఇలియానా మళ్ళీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తుందట.
కానీ ఇలియానా సినిమాల్లోకి రీ ఎంట్రి ఇవ్వడం మైఖేల్ డోలన్ కి అస్సలు ఇష్టం లేదట.ఈ విషయంలో కూడా ఇద్దరి మధ్య కాస్త మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే సందర్భంలో మైఖేల్ డోలన్ కూడా మరో మహిళతో క్లోజ్ గా ఉండడం ఇలియానాకి అస్సలు నచ్చడం లేదట.దీంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో మ్యూచువల్ డివోర్స్ తీసుకొని విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాల నుండి ఓ రూమర్ వినిపిస్తోంది.మరి ఇలియానా విడాకులు తీసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజముంది.. అది రూమరా లేక నిజమా అనేది ఇలియానా స్పందిస్తే గాని తెలియదు