మాతృదేవోభవ మూవీకి మొదట అనుకున్న స్టార్ కపుల్స్ ఎవరు .. అసలు ఈ సినిమాకు కర్చీఫ్ లు ఫ్రీగా ఎందుకు ఇచ్చారు..!?
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఎమోషనల్ సినిమా ఏది అని అడిగితే .. ఎవరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా మాతృదేవోభవ అని చెబుతారు . ఈ సినిమా కంటతడి పెట్టించని ప్రేక్షకులు లేరు . ఇలాంటి ఎమోషనల్ సినిమా ను అజయ్ కుమార్ తెరకెక్కించారు. మలయాళం లో అక్షద్ నే మూవీ సూపర్ హిట్ అయింది. ఆ మూవీలో మాధవి ముఖ్యపాత్రలో నటించారు. ఇక ఆ సినిమాకు రీమేక్ గానే మాతృదేవోభవ తెలుగులో వచ్చింది.
అయితే ముందుగా ఈ సినిమా కథను జీవిత, రాజశేఖర్ లకు చెప్పారు. అయితే కథ నచ్చిన ఈ సినిమాలో నటించేందుకు జీవిత ఒప్పుకోలేదు. పెళ్లి తర్వాత తను సినిమాలు కు దూరంగా ఉంటానని చెబుతూ ఈ సినిమాను వదులుకుంది .. అలానే రాజశేఖర్ కూడా నో చెప్పాడు. ఇక దాంతో చేసేదేమీ లేక మలయాళం లో నటించిన మాధవి ని తెలుగులో కూడా తీసుకున్నారు . ఇక నిజానికి మాధవి తెలుగమ్మాయి కాగా ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో మలయాళం లో సెటిల్ అయింది . అలాగే ఈ సినిమాలో హీరో లాంటి తండ్రి పాత్రలో నాజర్ ను తీసుకున్నారు . మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి ని తీసుకున్నారు . అలానే ఈ సినిమా పాటలను సీనియర్ రచయిత వేటూరి రాశారు .
1993అక్టోబర్ 22 న ఈ మూవీ విడుదల అయింది. కానీ రిలీజ్ రోజు మాత్రం అస్సలు కలెక్షన్స్ రాలేదు. అంతే కాదు సినిమా విడుదలైన తరవాత పాజిటివ్ టాక్ వస్తోంది కానీ థియేటర్ కు వచ్చేవారి సంఖ్యమాత్రం తక్కువగానే ఉంది. రెండు వారాల తరవాత థియేటర్ కు వచ్చిన ప్రతిఒక్కరికీ ఖర్చీఫ్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ తరవాత ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కట్ చేస్తే ఆరు కేంద్రాల్లో సినిమా వంద రోజులు ఆడింది. సినిమాకు భారీ కలెక్షన్స్ కూడా వచ్చాయి.